సూపర్ జీఎస్టీ..సూపర్ సేవింగ్స్ పై అవగాహ వాహన ర్యాలీ–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

జీఎస్టీ తగ్గింపుతో ఆటో మొబైల్ రంగంలో ప్రజలకు మేలు
సూపర్ జీఎస్టీ…సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా జీఎస్టీ తగ్గింపుతో ఆటోమొబైల్ రంగంలో ప్రజలకు చేకూరిన ప్రయోజనాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
వాహనాలపై భారీ మొత్తంలో జిఎస్టి తగ్గింపు కారణంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు రవాణా శాఖ, వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం భీమవరం లూథర్న్ హై స్కూల్ గ్రౌండ్ నుండి వాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జెండా ఊపి ప్రారంభించి, స్వయంగా స్కూటీ నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ ప్రారంభమై ప్రకాశం చౌక్, జెపి రోడ్ ల మీదుగా కాస్మోపాలిటన్ క్లబ్ “భీమవరం జీఎస్టీ బెనిఫిట్ బజార్” వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు జిఎస్టి నోడల్ అధికారి టి.రాహుల్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ వాహన ర్యాలీ ద్వారా జీఎస్టీ తగ్గింపుతో సామాన్య ప్రజలకు కలిగే ప్రయోజనాలను అందరికీ అర్ధమయ్యేలా అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ఆటో మొబైల్ రంగంలో జీఎస్టి తగ్గింపు ధరలపై ప్రజలకు అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. 350 సీసీ బైక్, అంతకంటే తక్కువ ఉన్న ప్రతి బైక్ మీద జీఎస్టీ బాగా రేటు తగ్గిందని, దీని వల్ల సామాన్య వినియోగదారులు సైతం బైకులు కొనుగోలు చేయడానికి చక్కటి అవకాశం లభించిందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ పండుగల సీజన్‌లో దసరా నుంచి దీపావళి వరకు ఎక్కువ మంది బైక్స్ కొనుగోలు చేయడానికి ఇది దోహదపడుతుందని వివరించారు. ఈ విధంగా జీఎస్టీ రేటు తగ్గడం వల్ల, బైక్ డీలర్స్‌కి కూడా విపరీతంగా విక్రయాలు పెరిగి, దీర్ఘకాలిక ప్రయోజనం కలగనున్నట్లు తెలిపారు.
ఈ ర్యాలీలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ కె.పి శైలజ, జిల్లా రవాణా అధికారి కే.ఎస్.ఎం.వి కృష్ణారావు, జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారి కొప్పర్తి అప్పారావు, జీఎస్టీవో డి.శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ కే.రామచంద్రారెడ్డి, బ్రేక్ ఇన్స్పెక్టర్ కె.ఎస్.ఆర్ ప్రసాద్, తహసీల్దార్ రావి రాంబాబు, ఎంపీడీవో ఎన్.మురళి గంగాధరరావు, రవాణా శాఖ సిబ్బంది, ఆటోమొబైల్ రంగ మేనేజర్లు, కొత్త ఆటో రిక్షాలు, ఆటో డ్రైవర్ సేవాలో లబ్ధిదారులు, తేలికపాటి వాణిజ్య వాహనదారులు, తేలికపాటి మోటారు వాహనదారులు (కార్లు), ద్విచక్ర వాహనదారులు, తదితరులు పాల్గొన్నారు.