Close

సూపర్ జీఎస్టీ…..సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Publish Date : 01/10/2025

జీఎస్టీ తగ్గింపు ద్వారా ప్రజలకు లభించే ఆర్థిక ప్రయోజనాల గురించి జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలిసేలా అధికారులు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి.

సూపర్ జీఎస్టీ…సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా బుధవారం పెనుమంట్ర మండలం ఆలమూరు సచివాలయం వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ఎగ్జిబిషన్లో ఏర్పాటుచేసిన వివిధ వ్యవసాయ యంత్ర పరికరాలను, పనిముట్లను, జీఎస్టీ తగ్గింపునకు ముందు ధరలు, తగ్గించిన తరువాత ధరల వ్యత్యాసాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలు అమలులో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా గ్రామస్థాయి నుండి జిల్లాస్థాయి వరకు అధికారులందరూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోందన్నారు. జీఎస్టీ తగ్గింపు తదుపరి ఏయే వస్తువులకు ఎంత మేర ధరలు తగ్గాయి, ఎంత మేరకు ఆదా జరుగుతుంది ఇంటింటా ప్రచారం చేయడం జరుగుతోందన్నారు. జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రతి కుటుంబానికి నెలకు 2 వేల నుండి 3 వేల రూపాయల వరకు ఆదా అవుతుందన్నారు. జీఎస్టీ తగ్గింపు ద్వారా నిత్యవసర వస్తువులు, ఎలక్ట్రానిక్, వ్యవసాయ, వైద్య, ఇన్సూరెన్స్, తదితర రంగాలకు చెందిన ధరలు తగ్గాయి అన్నారు. ఈ తగ్గింపు వల్ల ప్రజలకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందన్నారు. జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజలకు లభించే ఆర్థిక ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలా ఇంటింటి ప్రచారంలో కరపత్రాల పంపిణీ తో పాటు ర్యాలీలు, ఎగ్జిబిషన్స్,వర్క్ షాపులు నిర్వహించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా సూపర్ జీఎస్టీ….సూపర్ సేవింగ్స్ కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు సంయుక్తంగా ఆవిష్కరించారు.

ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు ద్వారా వ్యవసాయ, ఆక్వా , ఇన్సూరెన్స్,మందులు, పాఠ్య పుస్తకాలు, స్టేషనరీ సామాగ్రి తదితర వస్తువులు ధరలు బాగా తగ్గాయన్నారు. దీనివల్ల సామాన్యులకు ఆర్థికంగా ఎంతో లాభం చేకూరుతుందన్నారు. జీఎస్టీ తగ్గింపు ద్వారా ఏ మేరకు ప్రజలకు మేలు జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలియజేసేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.అధికారులు, ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఈనెల 9వ తేదీ నుండి ప్రతి పల్లె లో జిఎస్టి తగ్గింపు ద్వారా లభించే ప్రయోజనాలపై ప్రజలకు తెలియజేసేందుకు అవగాహన కార్యక్రమాలు చేయబడతామన్నారు.

అనంతరం ఆలమూరు సచివాలయం నుండి మార్టేరు సెంటర్ వరకు ట్రాక్టర్ ర్యాలీని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జెండా ఊపి ప్రారంభించి మార్టేరు సెంటర్ వరకు జోరున వాన కురుస్తున్న ట్రాక్టర్ పై ఉండి ర్యాలీలో పాల్గొన్నారు. దారి పొడవునా మహిళలు పెద్ద ఎత్తున జిల్లా కలెక్టరుకు పూల దండలు వేసి ర్యాలీని స్వాగతించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, కమర్షియల్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ కె.వి శ్రీనివాసరావు, తహాసిల్దార్ వై రవికుమార్, గ్రామ సర్పంచ్ ఎం.వెంకటరమణ, వివిధ శాఖల అధికారులు, సచివాలయం సిబ్బంది, ప్రజా ప్రతినిధులు రైతులు, తదితరులు పాల్గొన్నారు.