Close

సూపర్ జీఎస్టీ…..సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Publish Date : 27/09/2025

జీఎస్టీ తగ్గింపు ఫలాలు జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలిసేలా అధికారులు ప్రణాళిక బద్ధంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి.

శనివారం కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో వాణిజ్యపన్నుల శాఖ ఆధ్వర్యంలో జిఎస్టి సంస్కరణల అమలులో భాగంగా వివిధ వ్యాపార రంగాలైన ఆటోమొబైల్స్, పౌల్ట్రీ, ఆక్వా, ట్రాన్స్పోర్ట్, కన్స్ట్రక్షన్స్, ఇన్సూరెన్స్, చాంబర్ ఆఫ్ కామర్స్, కిరాణా మర్చంట్ తదితర వ్యాపార సంస్థలు అసోసియేషన్స్ ప్రతినిధులు, జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వస్తుసేవల పన్ను తగ్గింపు జిఎస్టి 2.0 ప్రయోజనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు జిల్లాలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు తమ వంతు సహకారం అందించాలని కోరారు.

జిల్లా అధికారులు సంబంధిత వ్యాపారవేత్తల, సంస్థల భాగస్వామ్యంతో విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జీఎస్టీ తగ్గింపు ద్వారా నిత్యవసర వస్తువులు, ఎలక్ట్రానిక్, వ్యవసాయ, వైద్య, ఇన్సూరెన్స్ తదితర రంగాలకు చెందిన ధరలు తగ్గనున్నాయన్నారు. ఈ తగ్గింపు వల్ల ప్రజలకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందన్నారు. ఏ మేరకు లబ్ధి చేకూరనున్నదో ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జీఎస్టీ తగ్గింపునకు ముందు ఉన్న ధర, ప్రస్తుత ధర ఎంత మేర లబ్ధి చేకూరింది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా ఇంటింటి ప్రచారంలో కరపత్రాల పంపిణీ తో పాటుగా ర్యాలీలు, ఎగ్జిబిషన్స్, వర్క్ షాపులు నిర్వహించి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు, అదేవిధంగా పాఠశాలలు, కళాశాలల విద్యార్థిని విద్యార్థులకు కాంపిటీషన్స్, పెయింటింగ్ పోటీలు నిర్వహించి వారికి అవగాహన కల్పించాలన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రతి ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు.

ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈనెల 25 నుండి 29 వరకూ ఇంటింటికీ జిఎస్టి ఫలాలు పేరిట ప్రచార కార్యక్రమంలో భాగంగా సామాన్య ప్రజలకు గృహ, నిత్యావసర వస్తువులు, ఆహారం, మందులు, విద్యా, స్టేషనరీ, బట్టలు, క్రీడా వస్తువులు, మహిళలు, పిల్లలు, రవాణా అంశాలకు సంబంధించి జిఎస్టి తగ్గింపు వల్ల కలిగే లబ్దిపై అవగాహన కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. అదే విధంగా సెప్టెంబరు 30 నుండి అక్టోబరు 6 వరకూ వ్యవసాయం మరియు ఇతర వృత్తుల వారికి అనగా వ్యవసాయ,ఉద్యాన వన, ఉపాధిహామీ కూలీలు, మత్స్యకారులు, ఆక్వా రైతులు, ట్రేడింగ్ ఎంస్ఎంఇలు, నేత, హస్త కళాకారులు, పేపరు మరియు ఫ్యాకేజింగ్, సెలూన్లు, స్పా, యోగా కేంద్రాలు, జిమ్, టైక్స్ టైల్స్ రంగాల్లో పనిచేసే వారికి అవగాహన, ట్రాక్టర్ ర్యాలీలు, మేళాలు, ఎగ్జిబిషన్ల నిర్వహణ చేపట్టాల్సి ఉందని తెలిపారు. అదే విధంగా అక్టోబరు 7నుండి 13 వరకూ మానవ వనరుల అభివృద్ధి మరియు డిజిటల్ సాంకేతికతకు సంబంధించి విద్య, జీవిత బీమా మరియు ఆరోగ్య బీమా, ఎలక్ట్రానిక్స్, ఎంట్రప్రెన్యూర్ షిప్పు, ఇ-కామార్స్ అండ్ గిగ్ ఎకానమీ కి సంబంధించిన అవగాహన కార్యక్రమాలతో పాటు విద్యార్ధులకు వ్యాసరచన, పెయింటింగ్ పోటీలు, జిల్లా స్థాయిలో మాన్యుఫ్యాక్చర్లు, డీలర్లచే ఎగ్జిబిషన్లు, ద్విచక్ర వాహనాల ర్యాలీలు, సెమినార్లు వంటి కార్యక్రమాలు చేయాల్సి ఉందన్నారు. అక్టోబరు 14న జిల్లా, మండల, నియోజకవర్గ కేంద్రాల్లో వికాస్ విస్వాస్ – నమ్మకమైన అభివృద్ధికి సంబంధించి బిల్డింగ్, డెవలపర్స్ మరియు కనస్ట్రక్షన్ మెటీరియల్స్ పై ఎగ్జిబిషన్లు, టూరిజం హాస్పిటాలిటీకి సంబంధించి టూరిస్ట్ ఏజెంట్లు, బజ్డెట్ హోటళ్లచే సాండ్ ఆర్ట్, ఫ్లాస్ మాబ్స్ వంటివి నిర్వహించాలని చెప్పారు. 15న ట్రాన్సుపోర్టు, లాజిస్టిక్స్ కు సంబంధించి చిన్న వాహనాల ర్యాలీ, 16న స్పోర్ట్సు గూడ్స్, రెన్యువల్ ఎనర్జీ, ఆటోమొబైల్ మరియు మాన్యు ఫ్యాక్చరింగ్ రంగాల్లో కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన, బైక్ ర్యాలీలు వంటివి నిర్వహించాలని చెప్పారు. దీపావళి పర్వదినానికి ముందు రోజైన అక్టోబరు 19వ తేదీన నెలరోజుల కార్యక్రమం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ముగింపు కార్యక్రమం సందర్భంగా జిల్లా స్థాయిలో వివిధ వ్యాపార, వర్తకరంగాల భాగస్వామ్యంతో షాపింగ్ ఫెస్టివల్ ను పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందన్నారు.

జిఎస్టి చాంపియన్స్ పేరిట జిల్లాలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ని నోడల్ అధికారిగా జిల్లా జిఎస్టి చాంపియన్ గా, సంబంధిత శాఖల జిల్లా అధికారి వారి శాఖ జిఎస్టి చాంపియన్ గాను, అసెంబ్లీ నియోజవర్గ స్థాయిలో ప్రత్యేక అధికారి, మండల స్థాయిలో ఎంపిడిఏ, మున్సిపల్ కమీషనర్, గ్రామ వార్డు సచివాలయాల స్థాయిలో పంచాయితీ, వార్డు అడ్మిన్ కార్యదర్శి జిఎస్టి చాంపియన్ గా ఉంటారని తెలిపారు. అంతేగాక ఈనెల రోజుల ప్రచార కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ప్లాట్ ఫారమ్ లు, హోర్డింగ్లు, ఇతర ఔట్ డోర్ ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని వివరించారు.

ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఏలూరు డివిజన్ వాణిజ్య పన్నుల డిప్యూటీ కమిషనర్ కెపి శైలజ, డిపిఓ ఎం. రామనాథరెడ్డి, డీఈవో ఈ.నారాయణ, డిఎం అండ్ హెచ్ ఓ జి గీతాబాయి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్. వెంకటేశ్వరరావు, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జవ్వాది హుస్సేన్, వాణిజ్య పన్నుల శాఖ భీమవరం, తణుకు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం సర్కిల్స్ కు చెందిన జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్లు వి.కేదారేశ్వర రావు, కె.వి. శ్రీనివాసరావు, డి.సాంబశివరావు డి.పి కిరణ్ కుమార్, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు