“సుశాసన్ సప్తాహ్ – ప్రశాసన్ గావ్ కి ఒరే 2025″ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.
సుపరిపాలన వారోత్సవాల్లో భాగంగా .. పరిపాలన గ్రామాల వైపు (“సుశాసన్ సప్తాహ్ .. ప్రశాసన్ గావ్ కీ ఒరే”) దేశవ్యాప్త ప్రచార ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం కలెక్టరేట్ నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి వర్చ్యువల్ గా తిలకించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లాలలో ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ఈ ప్రచార కార్యక్రమం డిసెంబర్ 19 నుండి 25 వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడానికి, సేవల డెలివరీని మెరుగుపరచడానికి దేశవ్యాప్తంగా నిర్వహించే ఒక ప్రచారం అన్నారు. పరిపాలనను గ్రామస్థాయికి చేర్చడం దీని లక్ష్యం అన్నారు. దీనిలో అధికారులు గ్రామాలకు వెళ్లి సేవలను అందిస్తారన్నారు. ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడం, ప్రభుత్వ సేవలను మెరుగ్గా, సులభంగా అందించడం జరుగుతుందన్నారు. “పరిపాలన గ్రామాలకు వెళ్తుంది” అనే నినాదంతో ప్రభుత్వ అధికారులు గ్రామాలకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకొని, పరిష్కారాలు చూపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వివిధ శాఖలు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొంటారని తెలిపారు. సుపరిపాలన పద్ధతులపై జిల్లా స్థాయి వర్క్‌షాప్‌లు నిర్వహించడం జరుగుతుందన్నారు.
వర్చువల్ కార్యక్రమంలో జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అధికారి వై.దోసిరెడ్డి పాల్గొన్నారు.