Close

సిఎఎ రిజిస్ట్రేషన్లకు ఎన్ఓసి సంబంధిత ఆర్డీవో కార్యాలయాల ద్వారానే పొందాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 13/02/2026

సిఎఎ (Coastal Aquaculture Authority) రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో భాగంగా అవసరమైన ఎన్ఓసి (No Objection Certificate)లను సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారుల కార్యాలయాల ద్వారా మాత్రమే పొందాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు.

సిఎఎ రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఇనామ్, జమీందారి భూములు అలాగే మొగల్తూరు మండలం, నర్సాపురం , యలమంచిలి, భీమవరం మండలాల్లో వెబ్ ల్యాండ్ లో డేటా లేని రైతులు సాగు చేస్తున్న భూముల వివరాలను మత్స్యశాఖ అధికారులు సమగ్రంగా సేకరించాలని ఆదేశించారు. ఆ వివరాల ఆధారంగా సంబంధిత ఆర్డీవో కార్యాలయాల ద్వారా ఎన్ఓసి పొందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్ఓసి పొందేందుకు ఎవరూ వీఆర్వోలను సంప్రదించవలసిన అవసరం లేదని, ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే సంబంధిత ఆర్డీవో కార్యాలయం లేదా మత్స్యశాఖ అధికారులను మాత్రమే సంప్రదించాలని జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలను జారీచేశారు.

అలాగే వెబ్‌ల్యాండ్‌లో డేటా నమోదైన ఆక్వా రైతులు అప్సడా (AP-SDA) రిజిస్ట్రేషన్లను రెవెన్యూ శాఖతో సంబంధం లేకుండా మత్స్యశాఖ అధికారులు తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. వెబ్ ల్యాండ్ లో డేటా నమోదుకాని రైతులు తప్పనిసరిగా సిఓసి పొందాలని, వీరికి సంబంధించిన వివరాలను మత్స్య శాఖ సిబ్బంది సేకరించి ఆర్డీవో కార్యాలయం ద్వారా సిఓసి పొందడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రక్రియలో ఆలస్యం లేకుండా రైతులకు సౌలభ్యం కల్పించేలా శాఖల మధ్య సమన్వయం ఉండాలని పేర్కొన్నారు.