సామాజిక పెన్షన్ లను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బల్పడాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

శనివారం తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ల నగదును అందజేశారు. పింఛన్లను అందజేస్తున్న సందర్భంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి లబ్ధిదారులను కుశల ప్రశ్నలు వేస్తూ ఆరోగ్యం బాగుందా, ఇంటికి వచ్చి పెన్షన్ అందజేస్తున్నారా, నెలకు ఎంత ఇస్తున్నారు, ఎవరైనా డబ్బులు అడుగుతున్నారని అని ఆరా తీశారు. లబ్ధిదారులు స్పందిస్తూ మొదటి తేదీన వేకువజామునే ఇంటి వద్ద పింఛన్ అందుకుంటున్నామని, ఇబ్బందులు ఏమీ లేవని సంతోషాన్ని వెలిబుచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో పింఛ ను మొత్తాన్ని పెద్ద ఎత్తున పెంచి అందజేయడం జరుగుతుందన్నారు. పింఛను సద్వినియోగం చేసుకొని ఖర్చులు పోను నెలనెలా కొంత మొత్తాన్ని . పొదుపు చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 25 రకాల పింఛన్లను 2,26,044 మంది లబ్ధిదారులకు రూ.96.61 కోట్లు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. నూరు శాతం పింఛన్లు పంపిణీని వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పింఛన్దారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లను అందజేయాలని ఏదైనా ఫిర్యాదు అందుకే చర్యలు తప్పవని హెచ్చరించారు.
పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఆర్డిఓ కతీబ్ కౌసర్ భానో, డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం ఎస్ ఎస్ వేణుగోపాల్, తహసిల్దార్ సునీల్ కుమార్, ఎంపీడీవో ఎం.విశ్వనాథం, సర్పంచ్ మద్దుకూరి గంగా భవాని, డిఆర్డిఏ ఏపీవో పెన్షన్స్ టి.మురళీకృష్ణ,, గ్రామ సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.