Close

సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు

Publish Date : 09/01/2025

గురువారం స్థానిక కలెక్టరేట్ జిల్లా ఖజానా కార్యాలయం నందు సంక్రాంతి సందర్భంగా ఏర్పాటుచేసిన బొమ్మల కొలువును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జ్యోతిని వెలిగించి ప్రారంభించి, ఖజానా కార్యాలయ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి సంబరాలు సాంప్రదాయం ఉట్టిపడేలా వేడుకగా జిల్లా ట్రెజరీ అధికారి ఆడారి గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించడాన్ని ప్రశంశించారు. కోలం ముగ్గులను, బొమ్మల కొలువును అలంకరణలను పరిశీలించి చాలా బాగుందని కితాబ్ ఇచ్చి, ఈ అలంకరణలో పాల్గొన్న మహిళా సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు వాళ్ళ అతి పెద్ద పండుగ సంక్రాంతి అని, కుటుంబ సభ్యులందరూ పండగ రోజుల్లో ఒక చోట చేరి ఆనందోత్సహాలతో సాంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగ సంక్రాంతి అన్నారు. బుద్దిని వృద్ధి చేసుకోవడం అనేది సంక్రాంతి పండుగ లోని ఆంతర్యం అన్నారు.

జిల్లా ట్రెజరీ కార్యాలయంలో తెలుగు సంక్రాతి పండుగను పురస్కరించుకొని గురువారం నుండి మూడు రోజులు పాటు సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రంగవల్లులు, పువ్వులతో కార్యాలయాన్ని అలంకరించటం, బొమ్మల కొలువు, భోగి మంట, చెరుకు గెడలు, పూర్ణకలశాలు, ధాన్యపు కంకులు, రేగిపళ్ళు మొదలైన వాటితో సంక్రాంతి శోభను తీర్చిదిద్దారు. గురువారం మధ్యాహ్నం సంక్రాంతి వంటలైన క్షీరాన్నం, కొబ్బరి అన్నం, చింతపండు పులిహార, పెరుగు ఆవడ, అరిసెలు, బూరెలు, గారెలు, బొబ్బట్లు, కాజాలు, సున్నుండలు, లడ్డూలు పూతరేకులు, కజ్జికాయలు, జంతికలు, అప్పడాలు, ఉలవచారు, పచ్చిపులుసు, రోటి పచ్చడి మొదలైన పిండివంటలను సిబ్బంది స్వయంగా తయారుచేసి ఆహుతులకు సంక్రాంతి విందును ఏర్పాటు చేశారు.

తొలుత సంక్రాంతి సందర్భంగా వంటలు, ముగ్గులు, క్రీడలు పోటీలను నిర్వహించి చివరిగా విజేతలకు బహుమతి ప్రదానం చేయడం జరిగింది.

ఈ వేడుకలలో జిల్లా ట్రెజరీ అధికారి ఆడారి గణేష్, సహాయ ట్రెజరీ అధికారి అబ్దుల్ హకీం, ఎస్ టి ఓలు జె. రామారావు, ఇ.హిమబిందు, ఎ.రవివర్మ, పి.హరిబాబు, ఎ.వి. శివాజీ, ట్రెజరీ అసోసియేషన్ అధ్యక్షులు యు.వి.పాండురంగారావు సినియర్ అకౌంటెంట్లు జె.మౌనిక, జ్యోతి, పి. వినీల, పి.విశాలి, జి.చంద్ర శేఖర రావు, సాయి బాలాజీ, ఎ. శ్రీనివాస్ రావు, ఎం.జగదీశ్వర రాజు, యం. సత్యనారాయణ, ప్రసాద్ బాబు, భాస్కర్, శోభన్, సూర్యనారాయణ, అంజమ్మ, తదితరులు పాల్గొన్నారు.

ఈ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా జిల్లా రెవిన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, డి పి ఆర్ ఓ టి.నాగేశ్వరరావు, జిల్లా దేవాదాయ శాఖ అధికారి ఈ సుబ్బారావు, బీసీ వెల్ఫేర్ అధికారి గణపతి రావు, డిఎంహెచ్వో భాను నాయక్, ఐ సి డి ఎస్ పి డి మీ సుజాత రాణి, తదితరులు పాల్గొని తిలకించారు.