సమీక్ష సమావేశాలకు పూర్తి తాజా సమాచారంతో అధికారులు హాజరు కావాలి కేంద్ర ఉక్క, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ.

సమన్వయం, పర్యవేక్షణ ఉండి చిత్తశుద్ధితో పనిచేస్తే ఏ కార్యక్రమం అయినా విజయవంతం అవుతుంది.
శుక్రవారం స్థానిక విష్ణు ఇంజనీరింగ్ కళాశాల ఆవరణ ఆడిటోరియంలో కేంద్ర ఉక్క, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ సమన్వయం, పర్యవేక్షణతో అధికారులు అంకితభావంతో పనిచేస్తే ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో పేదలకు చేరుతాయన్నారు. ముందుగా శాఖల వారీగా సమావేశానికి హాజరైన జిల్లా అధికారుల వివరాలు తెలుసుకున్నారు. కొంతమంది జిల్లా అధికారులు హాజరు కాకపోవడం మరియు కొంతమంది జిల్లా అధికారుల తరఫున వారి ప్రతినిధులను పంపడం పట్ల కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షించే సమావేశాలకు జిల్లాస్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని, కుదరకపోతే ముందస్తుగా జిల్లా కలెక్టర్ వారు అనుమతి తీసుకోవాలన్నారు. 35 శాఖల ద్వారా వివిధ రకాల 92 కేంద్ర ప్రభుత్వ పథకాలు జిల్లాలో అమలు జరుగుతున్నాయన్నారు. ఆయా పథకాల ప్రగతిని సమీక్షించాలంటే జిల్లా స్థాయి అధికారులు ఉంటేనే బాధ్యతాయుతమైన సమీక్ష ను నిర్వహించుకోగలుగుతామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో కలిసి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. అధికారులు వారి వ్యక్తిగతంగా ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోకుండా ప్రోటోకాల్ ప్రకారం నిబంధన మేరకు పనిచేయాలన్నారు. ప్రభుత్వ పథకాల ప్రగతి గురించి స్థానిక ప్రజాప్రతినిధులకు వివరించాలన్నారు. జిల్లాలో పథకాల అమల్లో భాగంగా శంకుస్థాపనులు, ప్రారంభోత్సవాల సమాచారాన్ని కూడా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యుల కార్యాలయాలకు విధిగా తెలియజేయాలన్నారు. దిశ కమిటీ సమావేశం ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించుకోవాల్సి ఉంటుందని, దీనిలో భాగంగా రెండో విడతగా ఏప్రిల్ నెలాఖరులోగా దిశ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు. ఆ సమావేశానికి అధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాలన్నారు. దిశా కమిటీ సమావేశం రోజువారీ జరిగే సమావేశం కాదని ఈ సమావేశంలో శాఖల వారీగా ప్రభుత్వ పథకాల ప్రగతిని సమీక్షించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో ఏమైనా సమస్యలుంటే నా దృష్టికి తీసుకురావచ్చు అని ఎప్పుడూ అందుబాటులో ఉంటాను.
జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రగతిపై శాఖల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతి రాజ్ శాఖలకు సంబంధించి చేపట్టిన పనులు ప్రగతి, ఖర్చు వివరాలను అధికారుల ద్వారా వివరణ కోరారు. ప్రభుత్వ పథకాల అమలను మరింత వేగవంతం చేసి మంచి ప్రగతిని సాధించేందుకు అధికార కృషి చేయాలి అన్నారు. జిల్లాలో అమలవుతున్న పథకాల ప్రగతి తీరును ప్రజాప్రతినిధుల దృష్టికి ఆయా శాఖల అధికారుల ద్వారా తీసుకెళ్లడం జరుగుతుంది అన్నారు. వచ్చే సమావేశానికి అధికారులందరూ పూర్తి సమాచారంతో హాజరయ్యేందుకు తగు చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రికి తెలిపారు. కేంద్ర మంత్రివర్యులు జిల్లా అభివృద్ధికి ఎంతో సహాయం చేస్తున్నారని, ఎన్ ఎం సి ఫండ్స్ నుండి 18.65 కోట్లను అందజేయడం జరిగిందన్నారు. మన జిల్లా పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రిగా ఉండటం మనకెంతో గొప్ప విషయం అని, వారి ద్వారా జిల్లా అభివృద్ధికి ఎంతో తోడ్పాటు లభిస్తుందని, ఇందుకు అనుగుణంగా అధికారులు కూడా కష్టించి పని చేయాలి అన్నారు. భవిష్యత్తులో మరిన్ని నిధులను జిల్లాకు మంజూరు చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఆచంట శాసనస భ్యులు పితాని సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న వివిధ పథకాలను అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి జిల్లాను మరింత అభివృద్ధి పథంలోని తీసుకువెళ్లాలన్నారు. అట్టడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కొత్తగా పి4 పథకాన్ని ఉగాది నుండి ప్రారంభించుకుంటున్నామని, ఈ పథకం ద్వారా పేద వర్గాల ప్రయోజనం కోసం పని చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములేనని ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలను సాధించాలన్నారు.
కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, భీమవరం ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ జెడ్.వెంకటేశ్వరరావు, సిపిఓ కె.శ్రీనివాసరావు, డిఆర్డిఏ పిడి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, డిఈఓ ఇ.నారాయణ, డి ఎం ఎం హెచ్ ఓ డాక్టర్ జి గీతాబాయి, డ్వామా పిడి కె సి హెచ్ అప్పారావు, గ్రామ, వార్డు సచివాల అధికారి పై దోసిరెడ్డి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.