సమిత్వ సర్వేలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు.
మంగళవారం విస్సకోడేరు గ్రామ సచివాలయం కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ అకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సమిత్వ సర్వేపై ఆరా తీస్తూ రికార్డులను పరిశీలించారు. ఎన్ని పీపీఎంలు ఉన్నాయి, ఇప్పటివరకు ఎన్ని మ్యాపింగ్ అయ్యాయి, మ్యాపింగ్ చేసేటప్పుడు ఏ విధానాలను పాటిస్తున్నారని ప్రశ్నించారు. విస్సకోడేరు గ్రామంలో స్వయంగా ఒక పిపిఎంను పరిశీలించారు. అలాగే స్వర్ణ పంచాయతీ వెబ్ పోర్టర్ ను స్వయంగా పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో పన్నులను వసూలు చేస్తున్నారా, పెండింగ్ ఏమైనా ఉన్నాయా, డిమాండ్లు ఇస్తున్నారా, వసూలు చేసిన పన్నులను ప్రభుత్వ ఎకౌంట్ కు చేస్తున్నారా అని అడిగి ఆన్లైన్లో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విస్సకోడేరు సచివాలయం పరిధిలో సమిత్వ గ్రౌండ్ ట్రూత్నింగ్ పనులు 88% పూర్తయ్యాయని, డిజిటల్ మ్యాపింగ్ 58 శాతం పూర్తయ్యాయని, నూరు శాతం శనివారం నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. సుమిత్వ సర్వేలో నిర్లక్ష్యం వహించకుండా తప్పులు లేని నివేదికలను రూపొందించాలన్నారు. గ్రామపంచాయతీలో పన్నుల వసూలు వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంలో జిల్లా సర్వే అధికారి కె.జాషువా, డిపిఓ ఎం.రామ్ నాథ్ రెడ్డి, తహసిల్దార్ ఎన్.విజయలక్ష్మి, ఎంపీడీవో వి.రెడ్డయ్య, ఈఓపిఆర్డి మల్లాది రాంప్రసాద్, పంచాయతీ సెక్రెటరీ కె.పవన్ కుమార్, గ్రామ సర్పంచ్ బి.శ్రీనివాస్, సచివాలయం సిబ్బంది, తదితరులు ఉన్నారు.