Close

సచివాలయంలో అర్జీదారు దరఖాస్తు సమర్పణలో వీఆర్వో లేదా పంచాయతీ కార్యదర్శి సంతకం కావాలని డిజిటల్ అసిస్టెంట్ లు ఎట్టి పరిస్థితుల్లో దరఖాస్తులు తిరస్కరించకూడదని ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు.

Publish Date : 02/01/2026

రాష్ట్ర సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలెక్టర్లతో రైల్వే అండర్ బ్రిడ్జిలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వేకు సంబంధించి పెండింగ్ భూసేకరణ కేసులకు సంబంధించిన అంశాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణి, పాజిటివ్ పబ్లిక్ పెరసెప్సన్, డాక్యుమెంట్ అప్లోడ్ ఏజెంట్ అంశాలపై శుక్రవారం వీడియో సమావేశం నిర్వహించారు. భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ రాష్ట్రంలో రెవెన్యూ సంబంధిత సమస్యలను వీలైనంత వరకూ తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ఈనెల 2 నుండి 9 వరకూ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నందున ఆ పంపిణీ కార్యక్రమం సక్రమంగా జరిగేలా జిల్లా కలక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని కలక్టర్లను ఆదేశించారు. పాత పట్టాదార్ పాస్ పుస్తకాల స్థానే రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని చేపట్టడం జరిగిందని ఏడాది పాటు ప్రతినెలా ఈపాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించి భూమి ఉన్న ప్రతి రైతుకూ ఈకొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం వివిధ రైల్వే ప్రాజెక్టులు, రైల్వే లెవెల్ క్రాసింగ్స్ స్థానే నిర్మించే ఆర్ ఓబిలు,ఆర్ యుబిలకు భూసేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్లను సిఎస్ విజయానంద్ ఆదేశించారు. దశల వారీగా అన్ని రైల్వే లెవెల్ క్రాసింగ్ లను తొలగించి వాటి స్థాన్ రైల్వే ఓవర్ బ్రిడ్జిలు లేదా రైలేవే అండర్ బ్రిడ్జిల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నందున అవసరమైన ఆర్ఓబి,ఆర్ యుబిల నిర్మాణానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ సచివాలయంలో అర్జీదారు దరఖాస్తు సమర్పణలో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి సంతకం కావాలని దరఖాస్తు తిరస్కరించకుండా అప్లికేషన్ తీసుకోవాలని డిజిటల్ అసిస్టెంట్ కు తెలియజేయాలని ఇప్పటికే ఎంపీడీఓలకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని సిఎస్ కు జిల్లా కలెక్టర్ వివరించారు. మరోసారి రివ్యూ చేసుకుంటామన్నారు. రెవిన్యూ సమస్యల పరిస్కారంలో జిల్లా టాప్ 5 లో ఉన్నామన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్సలో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్వో బి. శివన్నారాయణరెడ్డి, ఆర్ డి ఓ లు కె. ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఖతిబ్ కౌసర్ బానో, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.