Close

శారీరిక అవరోధాలు ఉన్నప్పటికీ ధైర్యంతో ముందుకు సాగాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు

Publish Date : 13/02/2026

విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా పోడూరు జిల్లా పరిషత్ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విభిన్న ప్రతిభావంతురాలు గోడి లక్ష్మి ప్రసన్న కు క్రచేస్ ను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎవరు ఏ విషయంలోనూ తక్కువ కాదని శారీరక అవరోధాలు ఉన్నప్పటికీ ధైర్యంతో ముందుకు సాగాలని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పూర్తిగా వినియోగించుకోవాలని అన్నారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. అవసరమైన సహాయక పరికరాలు, పెన్షన్లు, వైద్య సహాయం వంటి సేవలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఉన్నత చదువులు చదువుకుని ఆదర్శంగా నిలవాలని విద్యార్థి గోడి లక్ష్మీ ప్రసన్నను జిల్లా జాయింట్ కలెక్టర్ సూచించారు. తమ సమస్యను గుర్తించి వెంటనే ప్రభుత్వం ద్వారా క్రచేస్ అందజేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి కి మరియు విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులకు లక్ష్మీప్రసన్న, ఆమె తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు బి.రామ్ కుమార్, సిబ్బంది, తదితరులు ఉన్నారు.