వ్యవసాయ, ఉద్యానవన పంట నష్టం నమోదు కంట్రోల్ రూమ్‌ను పరిశీలించిన ఇన్‌చార్జి కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ
Publish Date : 22/11/2026
ఇటీవల సంభవించిన ఆర్నాబ్, మురుసు తుఫానుల నేపథ్యంలో వ్యవసాయ, ఉద్యానవన పంటలకు జరిగిన నష్టాన్ని నమోదు చేసేందుకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను ఆదివారం ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టం వివరాల నమోదు ప్రక్రియను, రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులు, వాటిపై తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టం అంచనాలో అర్హులైన రైతులందరికీ న్యాయం జరిగేలా సమగ్ర వివరాలు నమోదు చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు