Close

వ్యవసాయ అధికారులు సూచనలు మేరకు యూరియాను వినియోగించండి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 07/09/2025

రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా యూరియాను అందిస్తున్నా0

ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తెలపండి

కాళ్ల మండలం కోపల్లె గ్రామంలో విశాల సహకార సొసైటీ బ్యాంక్ నందు ఆదివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యూరియా వినియోగంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రైతులు వ్యవసాయ శాఖ అధికారులు సూచనల మేరకు ఎరువులను ఉపయోగించాలని అన్నారు అధికంగా వాడుట వలన ఏటువంటి ప్రయోజనం ఉండదని అన్నారు. ఎరువులు ఎక్కువగా ఉపయోగించడం వలన ఆరోగ్యపరమైన దుష్ప్రభావాలు తప్ప ఫలితాలు ఉండవని రైతులు గమనించాలని అన్నారు. ఎరువులు వినియోగాన్ని క్రమంగా తగ్గించి తద్వారా దిగుబడులు పెంచుకునే విధానాల మీద సరైన అవగాహన పెంచుకోవాలని సూచించారు. పకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలన్నారు. జిల్లాలో ఎక్కడ యూరియా కొరత లేదని, అన్ని సొసైటీలో అందుబాటులో ఉంచడం జరిగిందని అన్నారు. రైతులకు ఎటువంటి సమస్యలు ఉన్న నేరుగా తనకు తెలపవచ్చునని జిల్లా కలెక్టర్ అన్నారు. ఎక్కడైనా యూరియా అధిక ధరలకు అమ్మిన, అక్రమాలకు పాల్పడిన అట్టివారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. ఈ సందర్భంగా సొసైటీ గోదాములలో ఎరువుల స్టాకును పరిశీలించి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత శాఖల అధికారులును వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లా సహకార శాఖ అధికారి ఎస్.మురళీకృష్ణ, బ్యాంక్ చైర్మన్ నంద్యాల రామరాజు, ఏ డి ఏ కె. జీవన్ ప్రతాప్, తాహసిల్దార్ సుందర్ సింగ్, ఎం ఏ ఓ పి.రమేష్ నాయుడు, డిఎల్ఓ సత్యనారాయణ, కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ నంద్యాల రామరాజు, కార్యదర్శి జంపన సాయి గీత, స్థానిక దంతులూరి శ్రీనివాస రాజు, బ్యాంకు డైరెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

1.11