Close

వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి, అవసరత మేరకు వెంటనే నిర్మాణాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Publish Date : 23/09/2025

మంగళవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన డిస్ట్రిక్ట్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ మీటింగ్ ను సంబంధిత కమిటీ సభ్యులతో కలిపి నిర్వహించి స్వచ్ఛభారత్ మిషన్ పనులు, స్వచ్ఛతాహి సేవ -2025 కార్యక్రమాలు, జల జీవన్ మిషన్ పనులు, విలేజ్ వాటర్ అండ్ శానిటేషన్ కమిటీ సభ్యుల చొరవ, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ 2023 – 24 & 2025 – 2026 సంవత్సరాల్లో 1,550 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు కాగా, 915 పూర్తి చేయడం జరిగిందని, 103 నిర్మాణాల్లో ఉన్నాయని, ఇంకా 532 ఇంకా ప్రారంభించాల్సి ఉందన్నారు. అలాగే సామూహిక మరుగుదొడ్లు నిర్మాణంలో భాగంగా 2022 మరియు 2025 – 26 సంవత్సరాల్లో గ్రామపంచాయతీలు, సంస్థలలో నిర్మాణాలకు 204 మంజూరు చేయగా 130 నిర్మాణాలు పూర్తి చేయడం జరిగిందని, 37 నిర్మాణ దశలో ఉన్నాయని, ఇంకా 37 ప్రారంభించాల్సి ఉందన్నారు. జిల్లాలోని పిహెచ్సిలు, పశుసంవర్ధక శాఖ కార్యాలయాలు, మండల సమైక్యలు, తదితర విభాగాలకు మరుగుదొడ్ల అవసరం చాలా ఉందని, సంబంధిత కార్యాలయాల నుండి ప్రతిపాదనలు తీసుకొని వెంటనే మరుగుదొడ్ల నిర్మాణాలకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భీమవరం, గణపవరం, మొగల్తూరు, నరసాపురం, తాడేపల్లిగూడెం, ఉండి మండలాలను నూరు శాతం మోడల్ మండలాలుగా ప్రకటించడం జరిగిందన్నారు. జిల్లాలోని 294 గ్రామాల్లో 232 గ్రామాలను ఓడిఎఫ్ ప్లస్ మోడల్ గ్రామాలుగా ప్రకటించడం జరిగిందన్నారు. ఇంకా మిగిలిన 62 గ్రామాలను మోడల్ గ్రామాలుగా ప్రకటించడానికి పంచాయతీరాజ్, జి ఎస్ డబ్ల్యూ ఎస్ అధికారులు కృషి చేయాలన్నారు. స్వచ్ఛత హి సేవ – 2025 యాక్షన్ ప్లాన్ లో భాగంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు వివిధ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. జిల్లాలో జల జీవన్ మిషన్ కింద 1,489 పనులను సుమారు 1,736 కోట్ల వ్యయంతో చేపట్టాల్సి ఉందన్నారు. 2024 – 25 & 2025 – 26 సంవత్సరాల్లో దీనిలో ఇప్పటివరకు 302 పనులను పూర్తి చేయడం జరిగిందని, 1,147 పనులు వివిధ దశల్లో ఉన్నాయని, ఇప్పటివరకు సుమారు రూ.1,182 కోట్లు వ్యయం చేయడం జరిగిందన్నారు. నీటి స్వచ్ఛత పరీక్షలను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని, వాస్తవ నివేదికను మాత్రమే ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. ఏ గ్రామంలో చేసిన స్వచ్ఛమైన నీరు అందడం లేదంటున్నారని, నీటి పరీక్షలు పారదర్శకంగా చేసి తగిన చర్యలు చేపట్టాలన్నారు. నీటి పరీక్షలకు గ్రామాల్లోని డి.ఆర్.డి.ఏ మహిళ సిబ్బందికి శిక్షణ కూడా ఇవ్వడం జరిగిందని, వారిని నీటి పరీక్షలకు వినియోగించాలని సూచించారు. జె.జె.ఎం కింద జిల్లాలో 3,69,137 గృహాలకు గాను 14,357 కుళాయిలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మిగిలిన కుళాయిలను త్వరగా ఏర్పాటు చేయాలన్నారు. అంగన్వాడీలకు మరుగుదొడ్లు, తాగునీటి పనులు నూరు శాతం పూర్తి చేయాలన్నారు. కమ్యూనిటీ సోక్ పిట్స్ నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని 2025 – 26 సంవత్సరానికి ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ.347.25 లక్షల అంచనా వ్యయంతో 442 కమ్యూనిటీ సోక్ పిట్స్ మంజూరు చేయడం జరిగిందన్నారు. వీటి నిర్మాణాలకు త్వరితగతన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ నీటి సరఫరా అధికారి కె.శ్రీనివాసరావు, డిఈ టి.శ్రీనివాస్, డిపిఓ రామ్ నాథ్ రెడ్డి, డి ఎం ఎన్ హెచ్ ఓ జి.గీతా బాయి, డిఆర్డిఏ పిడి ఎం ఎస్ ఎస్ వేణుగోపాల్, జిల్లా అటవీ శాఖ అధికారి ఆశ కిరణ్, గ్రౌండ్ వాటర్ ఎడి గంగాధర్, డి ఎల్ డి ఓ వై.దోసిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.