విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
చేతి వృత్తులకు ఏప్పుడు విలువ ఉంటుంది
ఘనంగా విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవం
మంగళవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు జిల్లా బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవం అనేది దైవిక శిల్పి అయిన విశ్వకర్మ పుట్టినరోజును జరుపుకునే ఒక పండుగ అన్నారు. ఈ రోజున ప్రజలు తమ చేతి వృత్తికి సంబంధించిన పరికరాలను పూజించుకోవడం జరుగుతుందని అన్నారు. చేతివృత్తులు మన జీవితంలో ఒక భాగం అని మనం వాడే వస్తువులు చేతివృత్తుల నుండి వచ్చినవే అని అన్నారు. ప్రపంచంలో రకరకాల టెక్నాలజీ వచ్చినప్పటికీ చేతివృత్తుల కు ఎప్పుడూ విలువ ఉంటుందని అన్నారు. భావితలాల వారికి చేతివృత్తులపై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా చేతివృత్తులకు మంచి ఆదరణ ఉందని, ఎన్ని సాంకేతిక పరమైన పరికరాలు వసతులు అందుబాటులోకి వచ్చిన చేతివృత్తులకు ఎక్కువ ఆదరణ కనబరుస్తున్నారని
ఈ సందర్భంగా తెలిపారు. చేతి వృత్తి కళాకారులను గౌరవించినట్లయితే వారికి మంచి ఆదరణ ప్రోత్సాహం అందించినట్లయితే భవిష్యత్తు రోజుల్లో చేతి వృత్తి కళాకారులను అంతరించిపోకుండా కాపాడుకోవచ్చని ఆయన అన్నారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ నాయకులు తెలియజేసిన వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళటం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా స్వర్ణ, వడ్రంగి, కమ్మర, కంచర, శిల్పి, చేతివృత్తులు చేసే వారిని పుష్పగుచ్చాలను అందజేసి, దృశ్యాలువాలతో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా సన్మానించారు.
అనంతరం విశ్వబ్రాహ్మణ చేతివృత్తి సంఘం సభ్యులు జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డిని, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రామాంజనేయులను, దృశ్యాలువాతో సన్మానించి జ్ఞాపికను అందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బిసీ సంక్షేమ శాఖ అధికారి బి.రామాంజనేయ రాజు, వసతి గృహాల అధికారులు జయంతి, మోహన్ రావు, సూపర్డెంట్ ఝాన్సీ, వి.సత్యనారాయణ, విశ్వబ్రాహ్మణ కార్పెండెర్స్ జిల్లా అధ్యక్షులు చిట్టి మోజు బోగేశ్వరరావు, కార్యదర్శి చెప్పాడా చంద్రశేఖర్, కడియం మాణిక్యచార్యులు, మేడూరి వీర వెంకట సత్యనారాయణ, చింతోజు పాండురంగాచార్యులు, కర్రెడ్ల తాతాజీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.