Close

వివిధ శాఖలలో పురోగతిలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి వినియోగం లోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Publish Date : 11/12/2025

జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఏపీ ఈ డబ్ల్యూ ఐ డి సి, సమగ్ర శిక్ష, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్ శాఖల ఇంజనీరింగ్ విభాగాల పర్యవేక్షణలో పీఎం శ్రీ వర్క్స్, మనబడి మన భవిష్యత్తు ఫేజ్ వన్ అండ్ టు, జల జీవన్ మిషన్ పనులు, జిల్లాలోని భీమవరం, నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు మున్సిపాలిటీలు, ఆకివీడు నగర పంచాయతీలలో చేపట్టిన, చేపట్టవలసిన పనుల పురోగతిపై జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మనబడి మన భవిష్యత్తు ఫేజ్ వన్ క్రింద 430 పనులను రూ.14.17 కోట్ల వ్యయంతో చేపట్టి నూరు శాతం పూర్తి చేయడం జరిగింది అన్నారు. ఫేజ్ టు లో 1,076 పనులను రూ.56.17 కోట్ల అంచనా వ్యయంతో మంజూరు చేయడం జరిగిందన్నారు. వీటిలో రూ.16.81 కోట్ల విలువ కలిగిన 507 పనులను పూర్తి చేయడం జరిగింది అన్నారు. మరో 394 పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని తెలిపారు. పాఠశాలల్లో రన్నింగ్ వాటర్ తో మరుగుదొడ్లు 106 పనులు, విద్యుదీకరుణ తో పాటు ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు ఏర్పాట్లు 103, తాగునీటి సరఫరా 107, ఫర్నిచర్ ఏర్పాటు 107, పాఠశాలల రంగులు వేయుట 106, పెద్ద, చిన్న మరమ్మత్తులు చేయుట 107, గ్రీన్ చాక్ బోర్డ్స్ ఏర్పాటు 103, అదనపు గదుల నిర్మాణాలు 74, ప్రహరీ గోడల నిర్మాణం 83, ఇంగ్లీష్ ల్యాబ్లు ఏర్పాటు 68, కిచెన్ షెడ్లు ఏర్పాటు 80, కో-లోకేటెడ్ అంగన్వాడి సెంటర్లు 32 పనులను మనబడి మన భవిష్యత్తు ఫేజ్ టు నందు మంజూరు చేయడం జరిగిందన్నారు. పురోగతిలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోనికి తీసుకురావాలన్నారు. జిల్లాలో 27 పీఎం శ్రీ పాఠశాలలు ఉన్నాయని, వీటిలో ఆరు పాఠశాలకు కెమిస్ట్రీ ల్యాబ్లు ఏర్పాటు, 21 పాఠశాలకు ప్లే గ్రౌండ్ ఏర్పాటు, ఏడు పాఠశాలకు కిచెన్ గార్డెన్ ఫెన్సింగ్ ఏర్పాటు, ఒక పాఠశాలలో పి ఎం సి పేజ్ టు, ఆరు పాఠశాలకు రైన్ వాటర్ హార్వెస్టింగ్ పనులను, రెండు పాఠశాలలకు ర్యాంపు, హ్యాండ్ రైల్స్ ఏర్పాటు, ఆరు పాఠశాలలకు పీఎం శ్రీ పేజ్ 7 పనులను మొత్తం రూ.221.73 లక్షల అంచనా వ్యయంతో మంజూరు చేయడం జరిగిందన్నారు. వీటిలో 33 పనులు పూర్తి చేయడం జరిగిందని, పది పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. అలాగే జిల్లాలో జల జీవన్ మిషన్ కింద చేపట్టనున్న పైపులైన్ల నిర్మాణం పనులను సంబంధిత శాఖలు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమన్వయం చేసుకుంటూ పనులను ప్రారంభించాలని సూచించారు. అలాగే వివిధ మున్సిపాలిటీల పరిధిలో చేపట్టిన, చేపట్టవలసిన పనులను తత్విగతిన పూర్తి చేయాలని సంబంధిత మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో సమగ్ర శిక్ష ఏపీసి పి.శ్యామ్ సుందర్, పబ్లిక్ హెల్త్ ఈఈ విజయ్, జిల్లా ఆర్&బి అధికారి శ్రీనివాసరావు,, భీమవరం, నరసాపురం, పాలకొల్లు, ఆకువీడు, తాడేపల్లిగూడెం, తణుకు మున్సిపాలిటీల ఇంజనీరింగ్ అధికారులు, పంచాయతీరాజ్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.