Close

వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు బ్యాంకుర్లుకు విరివిగా రుణాలు అందించి వారి ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడాలి-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 29/07/2025

గ్రామీణ ప్రాంతాల్లో ఎస్ హెచ్ జి లకు విరివిగా రుణాలు మంజూరు చేయాలి లక్ష్యానికి చాలా తక్కువగా రుణాలు మంజూరు పై కలెక్టర్ ఆగ్రహం ..

సి.సి.ఆర్సి కార్డులు కలిగిన కౌలు రైతుల అందరికీ రుణాలు అందించాలి

చేనేత కార్మికులు ముద్ర రుణాలు మంజూరులో తాత్సారం ఎందుకు?
పీఎం ఎఫ్ బి వై ప్రీమియం జమలో నిర్లిప్తత ఎందుకు? రైతులు పంట నష్టపోతే ఎవరు బాధ్యత వహిస్తారు?

మంగళవారం జిల్లా కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం & జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశం (బ్యాంకర్ల సమావేశం) జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల అమలులో బ్యాంకర్ల పాత్ర కీలకమన్నారు. పథకాల లక్ష్యసాధనకు బ్యాంకర్లు తమవంతు సహకారం అందిచాలన్నారు. ముఖ్యంగా అర్హత కలిగిన కౌలు రైతులందరికీ రుణాలు అందించాలని బ్యాంకర్లను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్ హెచ్ జి లకు రుణాల మంజూరు లక్ష్యంలో చాలా లోటు కనిపిస్తుందని, ఎంసిపిలు (మైక్రో క్రెడిట్ ప్లాన్) అందిన వెంటనే రుణాలను మంజూరు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 27,910 ఎస్.హెచ్.జిలు ఉండగా 26,471 ఎస్ హెచ్ జి లకు రూ.977.74 కోట్ల రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. వీటిలో కేవలం 2,668 ఎస్ హెచ్ జి లకు రూ.144.85 కోట్లు మాత్రమే మంజూరు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డి ఆర్ డి ఎ ద్వారా పంపిన 9,633 ఎంసిపిలకు కూడా వెంటనే రుణాలను మంజూరు చేయాలని ఆదేశించారు. అలాగే చేనేత కార్మికులకు ముద్ర లోన్స్ మంజూరులో తీవ్ర జాప్యం ఎందుకని ప్రశ్నించారు. జిల్లాలో 253 మంది చేనేత కార్మికులకు రూ.1.11 కోట్లు మంజూరు చేయాలనేది లక్ష్యంగా కాగా కేవలం 13 దరఖాస్తులకు రూ.8.35 లక్షలు మాత్రమే మంజూరు చేయడంపై ఆ సహనం వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న 83 దరఖాస్తులకు వెంటనే రుణాలను మంజూరు చేయాలని ఆదేశించారు. వీవర్స్ ముద్ర కింద తీసుకున్న రుణాలపై సబ్సిడీ మొత్తాన్ని విడుదల చేయాలని బ్యాంకర్లను కోరారు. కౌలు రైతులకు 1,05,500 సి సి ఆర్ సి కార్డులు జారీ లక్ష్యంకాగా 63,262 కార్డులు జారీ చేయడం జరిగిందన్నారు. వీటిలో 56,771 మంది కౌలు రైతులు రుణ అర్హత కలిగి ఉన్నారని, కేవలం 5,126 మందికి రూ.39.16 కోట్లు మాత్రమే మంజూరు చేయడం జరిగిందన్నారు. కౌలు రైతులకు త్వరితగితిన రుణాలు మంజూరు చేయాలి అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఆగస్టు రెండున రైతులు ఖాతాలలో నగదు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని, ఈ లోపుగా ఎన్పీసీఐ ఇన్ ఆక్టివ్ మరియు మ్యాపింగ్ లేని 2,050 రైతుల ఎకౌంట్లను వెంటనే యాక్టివ్, మ్యాపింగ్ చేయాలని సూచించారు. లేనిపక్షంలో వారికి నగదు అకౌంట్లో జమ కాదన్నారు. ప్రధానమంత్రి పసల బీమా యోజన పథకం ప్రీమియం మినహాయింపులు బ్యాంకర్ల ఉదాసీనత కనపడుతుందని, రేపు అనుకోని పంట నష్టం జరిగితే ఎవరూ బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఎకరానికి కేవలం రూ 250/- మాత్రమే ప్రియం చెల్లించాల్సి ఉంటుందని, ఒకవేళ రైతు వద్దు అనుకుంటే లిఖితపూర్వకంగా నమోదు చేసుకోవాలన్నారు. బ్యాంకులు నుండి రుణాలు పొందిన ప్రతి రైతు నుండి తప్పనిసరిగా ప్రీమియం మినహాయింపు చేయాలని, అలాగే జిల్లాలో వ్యవసాయ భూమి కలిగి స్వచ్ఛందంగా ప్రీమియం చెల్లింపుకు ముందుకు వచ్చే రైతుల నుండి కూడా ప్రీమియంను కట్టించుకోవాలన్నారు. ప్రీమియం చెల్లించే ప్రతి ఒక్క రైతు ఇ-పంట నమోదు తప్పనిసరి అన్నారు. ప్రీమియం చెల్లింపుకు ఆగస్టు 15 వరకు గడువు ఉందని తెలిపారు. పీఎం స్వనిధి పథకం కింద వీధి వ్యాపారులకు, చిన్న వ్యాపారస్తులకు రుణాలను అందించేందుకు బ్యాంకర్స్ శ్రద్ధ చూపాలన్నారు. అప్పుడే వారు మైక్రో ఫైనాన్సర్స్ నుండి అధిక వడ్డీలకు తెచ్చుకొని ఇబ్బంది పడకుండా ఉంటారన్నారు. పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ రుణాల మంజూరు, మెప్మా ఎస్ హెచ్ జి రుణాలు, స్టాండ్ ఆఫ్ ఇండియా, టిడ్కో హౌసింగ్ లోన్స్, పీఎంఈజీపి, పీఎం ఎఫ్ఎంఈ పథకాలు, పీఎం విశ్వకర్మ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు తదితర అంశాలపై సమీక్షించారు. బ్యాంకర్ల సమావేశానికి తప్పనిసరిగా బ్యాంకు కంట్రోలర్స్ మాత్రమే హాజరు కావాలని ఆదేశించారు. క్రింది స్థాయి సిబ్బంది వస్తే నిర్ణయాలు ఎలా తీసుకోగలరని ప్రశ్నించారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ ఎల్.వి.వి.ఆర్.కె. ఎం.ఎస్ మన్యం మాట్లాడుతూ ఎస్ హెచ్ జి రుణాల మంజూరులో వేగం పెంచాలని, అలాగే పిఎం సూర్యగర్ పథకం అమలు లక్ష్యానికి కృషి చేయాలని సూచించారు.

నాబార్డ్ ప్రతినిధి నిష్యంత్ చంద్ర మాట్లాడుతూ అగ్రికల్చర్ డిగ్రీ పొందిన వారికి 8 వారాలు పాటు శిక్షణ అందించి, వారు ఏర్పాటు చేసుకునే యాక్టివిటీస్ కి సబ్సిడీతో కూడిన రుణ సహాయం అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే పాడి రైతులు రైతులు కోసం కూడా రుణాలను అందుకే చేయడం జరుగుతుందని తెలిపారు.

చివరిగా 2025-26 సంవత్సరానికి జిల్లా వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు.

2025-26 సంవత్సరానికి రూ.29,608 కోట్లతో జిల్లా వార్షిక రుణ ప్రణాళికను ప్రవేశపెట్టగా, ప్రాధాన్యత రంగానికి రూ.24,670 కోట్లు, ప్రాధాన్యయేతర రంగాలకు రూ.4,938 కోట్లు కేటాయించడం జరిగింది. వీటిలో వ్యవసాయ స్వల్పకాలిక రుణాలకు రూ.8,418 కోట్లు, వ్యవసాయ. అనుబంధ టర్మ్ లోన్స్ కు రూ.4,800 కోట్లు, వ్యవసాయ అనుబంధ మౌలిక రంగాలకు రూ.1,839 కోట్లు, ఎంఎస్ఎంఈ రుణాలకు రూ.8,646 కోట్లు, ఇతర ప్రాధాన్యతా రంగాలకు రూ.967 కోట్లు, ప్రాధాన్యయేతర రంగాలకు రూ.4,938 కోట్లు కేటాయించడం జరిగింది.

ఈ సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎ.నాగేంద్ర ప్రసాద్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ ఎల్.వి.వి.ఆర్.కె. ఎం.ఎస్ మన్యం, నాబార్డ్ ప్రతినిధి నిష్యంత్ చంద్ర, ఆర్బిఐ ప్రతినిధి రామకృష్ణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, డి ఆర్ డి ఏ పి డి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతి రావు, జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారి అప్పారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ బ్యాంకుల కంట్రోలర్, జూనియర్ ఆఫీసర్స్, కోఆర్డినేటర్స్, తదితరులు పాల్గొన్నారు.