Close

వివిధ దశల్లో ఉన్న 575 గృహాలు స్టేజ్ కన్వర్షన్ కు పనులను వేగవంతం చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 05/02/2026

ఆప్షన్ త్రీ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలి..

విస్సాకోడేరు లే అవుట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్…

ఉగాది నాటికి విస్సాకోడేరు లే అవుట్ లోని 1,900 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలి..

ప్రస్తుతం స్లాబ్ కంప్లీట్ అయిన 120 ఇళ్లకు గోడల నిర్మాణాలను పూర్తి చేయాలి..

పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామంలో ఇళ్ల నిర్మాణాల లేఅవుట్ ను గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొత్తం ఎన్ని ప్లాట్ లు, ఎన్ని ఇళ్ళు మంజూరు అయ్యాయి, ఎన్ని ఇళ్ళ నిర్మాణాలు పూర్తయ్యాయి, మిగతావి ఏయే దశలలో ఉన్నాయి అని ఆరా తీశారు. ఆప్షన్ త్రీ క్రింద 3,600 ప్లాట్స్ కు గాను 2,150 ఇళ్ళు మంజూరు చేయడం జరిగిందని, ఇప్పటివరకు 231 గృహ నిర్మాణాలు పూర్తి చేయడం జరిగిందన్నారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. రామన్న ఉగాది నాటికి 1,900 ఇళ్ళు నిర్మాణాల లక్ష్యంగా పూర్తి చేసి అప్పగించాలని కాంట్రాక్టర్ పల్లా ఏసుబాబును ఆదేశించారు. ఇప్పటికే స్లాబులు పూర్తి చేసిన 120 ఇళ్లకు గోడలు పూర్తిచేసి అప్పగించాలన్నారు. వివిధ నిర్మాణ దశలో ఉన్న 575 గృహాలకు సంబంధించి తదుపరి పనులను వేగవంతం చేయాలన్నారు. తొలుత కాలనీ అంతా కలియతిరిగి ఇప్పటికే నివాసం ఉంటున్న కొన్ని కుటుంబాలతో మాట్లాడారు. దశలవారీగా అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. రోడ్డు ఇబ్బందిని పరిశీలించి క్వారీ రబ్బిష్ తో ఇప్పటికే నిర్మించిన 3 కిలోమీటర్ల నిడివి గల రోడ్డుపై మరొక లేయర్ గ్రావెల్ తో నిర్మించాలని భీమవరం మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ప్రభుత్వం ఇళ్ళ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించిందని, ఉగాది నాటికి లక్ష్యాన్ని పూర్తి చేసి లబ్ధిదారులతో గృహప్రవేశాలను చేయించాల్సి ఉందని తెలిపారు.

ఈ సందర్భంలో జిల్లా గృహ నిర్మాణాధికారి జి.పిచ్చయ్య, భీమవరం మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, టౌన్ సర్వేయర్ రమా బాయి, ఏటీపీ శ్రీలక్ష్మి, హౌసింగ్ డిఈ శ్రీరామరాజు, ఎ.ఈ శ్రీరామచంద్రమూర్తి, వర్క్ ఇన్స్పెక్టర్ బి.ఇస్మాయిల్, కాంట్రాక్టర్ పల్లా యేసుబాబు, తదితరులు ఉన్నారు.