Close

విద్యార్థులు భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు చదువుతోపాటు నైపుణ్యం ఎంతో అవసరం అని రాష్ట్ర శాసనసభ ఉపసభావతి కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు.

Publish Date : 03/01/2026

భీమవరం ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటుచేసిన కెరీర్ ఎగ్జిబిషన్ పోటీలను రాష్ట్ర శాసనసభ ఉపసభావతి కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంయుక్తంగా ప్రారంభించి, సమగ్ర శిక్ష పరిధిలోని జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఆలోచన చేసి జిల్లా వ్యాప్తంగా కెరీర్ గైడెన్స్, కౌన్సెలింగ్ కొరకు 6 మంది శిక్షకులను నియమించడం జరిగిందన్నారు. ఇటువంటి అవకాశం ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే ఉందన్నారు. విద్య లక్ష్యాలకు అనుగుణంగా కెరీర్ గైడెన్స్, కౌన్సెలింగ్ జీవితంలోని అన్ని రంగాలలో పిల్లల గరిష్ట వ్యక్తిగత అభివృద్ధిని సులభతరం చేయడం లక్ష్యంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందరి విద్యార్థుల అవసరాలను తీర్చే ప్రయత్నంలో, మార్గదర్శకత్వం, కౌన్సెలింగ్ విద్యను అర్థవంతమైన, సంతృప్తికరమైన అనుభవంగా మారుస్తుందన్నారు. ప్రాథమిక విద్యా స్థాయి నుండే ఒకేషనల్ విద్యను నేర్చుకోవడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణం నిర్మించుకునే విధంగా ఒక ప్లాట్ఫారం వేయటానికి ఒక మంచి ప్లానింగ్ తో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ముందుకు రావడం ఎంతో సంతోషించదగిన విషయం అన్నారు. జిల్లా పరిషత్ పాఠశాలలో స్థలం ఉందిగాని ఆట స్థలాలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. పిటిలను పార్ట్ టైం అయినా తీసుకుని ఈ ఒకేషనల్ ట్రైనింగ్ గేమ్స్ లో కూడా శిక్షణ అందించాలన్నారు. విద్యార్థులకు కలిగిన నుంచి ఆలోచనలను మీ హెడ్మాస్టర్లతో పంచుకోవాలని, అవి జిల్లా కలెక్టర్, మా వరకు వచ్చినప్పుడు వాటిని ఎలా ఆచరణలో ఎలా పెట్టవచ్చో ఆలోచన చేసి వాటిని శాయశక్తుల అమలు చేయడానికి కృషి చేస్తామన్నారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు కౌన్సిలర్లు ప్రభుత్వ పాఠశాలలోనే ఉన్నారని, ప్రైవేటు పాఠశాల్లో కూడా ఇటువంటి సహకార వ్యవస్థ లేదన్నారు. జిల్లా వ్యాప్తంగా 6 మంది మానసిక కౌన్సిలర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, విద్యార్థులు ఎవరైనా ఒత్తిడికి గురి కావడం, భవిష్యత్తును సక్రమంగా మలుచుకోవడం తదితర అంశాలపై కౌన్సిలింగ్ ద్వారా వీరు అవగాహన కల్పిస్తారు అన్నారు. ఈరోజు సమగ్ర శిక్ష పరిధిలోని 27 పాఠశాల నుండి 37 మంది విద్యార్థులు వారి ప్రాజెక్ట్లను ప్రదర్శించడం జరిగిందన్నారు. కలల సాకారానికి నిరంతరం కష్టపడాలని, ప్రారంభంలో వచ్చే అడ్డంకులను అధిగమిస్తూ లక్ష్యానికి చేరువ కావాలన్నారు. విద్యార్థులకు ఆసక్తి కల ట్రేడ్ ను ఎంపిక చేసుకుని దాని యందు నైపుణ్యం సాధిస్తే, ఇంటర్మీడియట్ స్థాయిలో మీరు ఏం చదవాలో నీకే అర్థమవుతుందని, తల్లిదండ్రుల అభిప్రాయాలను మీపై రుద్దడం ఉండదన్నారు.

ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీసి పి.శ్యాంసుందర్ మాట్లాడుతూ నేటి ప్రదర్శనలలో ఉత్తమంగా ఉన్న ప్రాజెక్టులను ఎంపిక చేసి రాష్ట్రస్థాయికి పంపడం జరుగుతుంది అన్నారు.

జిల్లా స్త్రీ,శిశు సంక్షేమ శాఖ అధికారి డి.శ్రీ లక్ష్మీ మాట్లాడుతూ విద్యార్థి దశలో చదువుపై దృష్టిని కేంద్రీకరించాలని, భాషా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, ఇతర నైపుణ్యాలను కూడా అందిపుచ్చుకోవాలన్నారు. అలా కాకుండా ఆకర్షణలకులోనై తప్పు మార్గంపడితే జీవితాంతం ఇబ్బంది పడతారని హెచ్చరించారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై ఆడపిల్లలు అవగాహన కలిగి ఉండాలన్నారు. తల్లిదండ్రులు లేని 18 సంవత్సరాల లోపు అనాధ పిల్లలను సంరక్షిస్తామని, ఎవరన్నా ఉంటే స్త్రీ,శిశు సంక్షేసు సంక్షేమ శాఖను సంప్రదించాలన్నారు.

ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష స్టేట్ కోఆర్డినేటర్ కె.దివ్య, డీఈవో ఇ.నారాయణ, గరల్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారి జి.ఏ.జెస్సీ దీవెనమ్మ, స్టేట్ అబ్జర్వర్లు భవ్య శ్రీ, శారదా దేవి, జిల్లా ఒకేషనల్ కోఆర్డినేటర్ పి.సంజీవ్ కుమార్, ఏఎంఓ సిహెచ్ చంద్రశేఖర్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.