Close

విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పరిశీలించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 06/03/2026

మార్చి 16 నుంచి నిర్వహించనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేయాలి

చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ అధికారులు సమన్వయంతో 10 తరగతి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయడానికి కృషి చేయాలి.

పదవ తరగతి పరీక్షలు నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ అధికారులదే కీలక పాత్ర

మాస్ కాపీయింగ్, తదితర ఎటువంటి పొరపాటు జరిగిన చర్యలు తప్పవ్

ఈ నెల 16వ తేదీ నుండి జరిగే పదవ తరగతి, అపోస్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు నియమించిన చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ అధికారులు, కస్టోడియన్స్, రూట్ ఆఫీసర్స్ తో విద్యాశాఖ ఆధ్వర్యంలో భీమవరం డిఎన్ఆర్ కళాశాల ఆడిటోరియం నందు నిర్వహించిన సమావేశానికి శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొని పదో తరగతి పరీక్షలు నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఈనెల 16వ తేదీ నుండి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలను, అలాగే మార్చి 16 నుండి మార్చి 28 వరకు ఎస్ ఎస్ సి ఆపోస్ పబ్లిక్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలకు 24,166 మంది రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు, అపోస్ పరీక్షలకు 680 మంది రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్షలు నిర్వహణకు 132 సెంటర్లను, ఆపోస్ కు 8 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 132 మంది చొప్పున చీఫ్ సూపర్ఇంటెండెన్స్, డిపార్ట్మెంటల్ అధికారులను, ఐదు మంది అదనపు డిపార్ట్మెంట్లు అధికారులను నియమించడం జరిగిందన్నారు. పరీక్షల నిర్వహణను 6 స్క్వాడ్లు తనిఖీచేయనున్నట్లు తెలిపారు. 2025 సంవత్సరం పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో జిల్లా 82.15 ఉత్తీర్ణత శాతాన్ని సాధించి రాష్ట్రంలో 16వ ర్యాంకులో నిలవడం జరిగిందని, ఈ సంవత్సరం మొదటి ర్యాంకు నిలిచేలా ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో విధులను నిర్వహించాలన్నారు. పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపర్ఇంటెండెన్స్, డిపార్ట్మెంటల్ అధికారులదే కీలకపాత్ర అని, పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా పగడ్బందీగా నిర్వహించి జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. ఎక్కడ మాస్ కాపీయింగ్, పేపర్ లీకేజ్ ఒంటివి జరగకూడదని, కట్టుదిట్టంగా వ్యవహరించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో డిఇఓ ఇ.నారాయణ, సమగ్ర శిక్ష ఏపీసి పి.శ్యామ్ సుందర్, ఏడి సత్యనారాయణ, డిప్యూటీ డిఈఓలు, చీఫ్ సూపర్ఇంటెండెన్స్, డిపార్ట్మెంటల్ అధికారులు, కస్టోడియన్స్, రూట్ ఆఫీసర్స్, తదితరులు పాల్గొన్నారు.