Close

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 18/02/2026

మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఎస్ ఆర్ కె ఆర్ మున్సిపల్ హై స్కూల్ ఆకస్మిక తనిఖీ

మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఆరా

విద్యార్థులు ఇష్టంగా చదివి మంచి ఫలితాలను సాధించాలి.

భీమవరం పట్టణంలో ఏ ఆర్ కె ఆర్ మున్సిపల్ హై స్కూల్ ను బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఆరా తీశారు. కిచెన్ రూమ్ లో ఉన్న ఆహార పదార్థాలను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం జరుగుతుందని అన్నారు. మీరు ప్రతిరోజు సంతృప్తిగా భోజనం చేయాలని, భోజనం రుచిగా ఉంటుందా వండిన కూరలు ఎలా ఉంటున్నాయి అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. చదువులో క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు త్రాగునీరు సౌకర్యం గురించి అడిగారు పరిశుభ్రంగా ఉండాలని భోజనంకు ముందు తర్వాత శుభ్రముగా చేతులు కడుక్కోవాలని విద్యార్థులకు సూచించారు. మధ్యాహ్న భోజన పథకంలో ఎటువంటి నాణ్యత లోపం లేకుండా అమలు చేయాలని నాణ్యత విషయంలో రాజీ పడకూడదని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం హాజరు శాతం పెంపు విద్యా ప్రమాణాలు అభివృద్ధికి మధ్యాహ్న భోజన పథకం దోహదపడుతుంది అన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించి పిల్లలతో కలిసి మాట్లాడుతూ భోజనం చేశారు. పాఠశాలకు డైనింగ్ హాలును దాతల సహకారంతో ఏర్పాటు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సూచించారు.

అనంతరం జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పదవ తరగతి క్లాస్ రూమ్ లకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు ఇష్టంగా చదివి మంచి ఫలితాలను సాధించాలని అన్నారు. పరీక్షలు అంటే భయం ఉండకూడదని సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 100 డేస్ యాక్షన్ ప్లాన్లు క్రమశిక్షణతో చదివి రాష్ట్రంలో జిల్లాకు ప్రథమ స్థానమును తీసుకువచ్చి స్కూలుకు మంచి పేరు తేవాలని అన్నారు. గణితం సైన్స్ ఇంగ్లీషు వంటి సబ్జెక్టుల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు. ప్రతివారం పెడుతున్న మార్క్ టెస్ట్ లు రాసి లోపాలను సరి చేసుకోవాలని, ఏమైనా తెలియని విషయాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి విద్యార్థులకు సూచించారు.

ఈ సందర్భంలో మండల విద్యాశాఖ అధికారి ఎన్.శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయులు పి బి. శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు ఉన్నారు.