విద్యార్థులకు సైన్స్ పై ఆసక్తి పెంచే విధంగా బోధనా పరికరాలతో విద్యాబోధన చేయాలి-ఇన్చార్జి కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి.

పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం ఇన్చార్జి కలెక్టర్ టీ.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని అటల్ టింకరింగ్ ల్యాబ్ లో ఎలక్ట్రాన్ మిషన్లు, త్రీడీ ప్రింటర్, వెల్డింగ్ మిషన్, షోల్డరింగ్ టూల్స్ తదితర సైన్స్ యంత్ర పరికరాలను ఇన్చార్జి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ల్యాబ్ లోని ఎలక్ట్రానిక్, సైన్స్ బోధన పరికరాలు పనితీరును,వాటి ఉపయోగాలను ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయనకు వివరించారు. రోజువారి విద్యా బోధనలో ఎలక్ట్రానిక్ యంత్రాలు, బోధన సామాగ్రి విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నది అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ల్యాబ్ లో ఉన్న ఎలక్ట్రానిక్, సైన్స్ బోధన పరికరాలు ఇంకా అవసరమైన ఎక్విప్మెంట్ పై నివేదిక పంపాలని సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అభియాన్ ఆఫీసర్ పి.శ్యాంసుందర్ ను ఆదేశించారు. విద్యార్థులకు సైన్స్ పై ఆసక్తి పెంచే విధంగా ఉపాధ్యాయులు బోధన పరికరాలను వినియోగిస్తూ నైపుణ్యవంతంగా విద్యాబోధన చేయాలని కోరారు.
ఈ సందర్భంలో సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పి.శ్యాంసుందర్, పాలకోడేరు తహసిల్దార్ విజయలక్ష్మి, ఎంఈఓ టీవీఎస్ నాగరాజు, ఇన్చార్జి హెచ్ఎం జెవివి సాయి ప్రసాద్, ఉపాధ్యాయులు, తదితరులు ఉన్నారు.