వికసిత్ భారత్ జి రామ్ జి పధకం ద్వారా ఉద్యానవన పంటలను సాగు చేసి రైతులు అభివృ ద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
శనివారం పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామంలో విస్తృత స్థాయిలో ఉద్యాన పంటలు ప్రోత్స హించడానికిజిల్లా కలెక్టర్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1500 ఎకరాల్లో ఉద్యాన వన పంటలుసాగు చేయుట ప్రభుత్వ లక్ష్యం కాగా ఇప్పటికీ 250 ఎకరాలలో వివిధ రకాలైన ఉద్యానవన పంటలు సాగు చేయడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. వికసిత్ భారత్ జి రామ్ జి పధకం క్రింద కూలీలకు కనీసం 312 రూపాయలు కనీస వేతనంగా వస్తుందని చెప్పారు. పథకం క్రింద సంవ త్సరానికి ప్రతి కుటుంబానికి 40,వేల రూపాయ లు కనీసం వేతనం వస్తుందని ఆమె చెప్పారు. ఈ పథకంలో చిరకాలం గా రైతులకు ఉపయోగపడే పనులను చేపట్టడం జరుగుతుందనిఆమె ఆమె చెప్పారు. ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం మొక్కలు నాటి నుండి మూడు సంవత్సరాల వరకు మొక్కలను కాపాడు కోవడానికి ఒక లక్ష 13 వేల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని కలెక్టర్ చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలో కేవలం వరి పంటలు పండు తాయని ఇతర పంటలు పండవనే అపోహలను రైతులు విడిచి పెట్టాలన్నారు. జిల్లాలో కేవలం వరి పంటలకే పరిమితం కాకుండా ఉద్యాన వన పంటలు మామిడి,పామాయి ల్ ,కోకో జామ, కొబ్బరి మునగ, సీతాఫలం, నేరేడు పంటలను సాగుచేయడానికి రైతులు ముందుకు రావాలన్నారు. ఈ సందర్భంగా రైతు మామిడి తోటలో జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో ఉండి శాసనసభ్యులు తనయుడు భరత్, దోమ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ అప్పారావు, ఏపీ డి స్వాతి ఎంపీడీవో రామప్రసాద్,తహసీల్దార్ లక్ష్మీ, ఏ.పి.ఓ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు