Close

వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవికా మిషన్, గ్రామీణ్ పథకంపై జనవరి 5న జిల్లాలో అన్ని గ్రామాలలో విస్తృతంగా గ్రామసభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Publish Date : 31/12/2025

బుధవారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ కాల్ నుండి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గర్ మిషన్ గ్రామీణ్ పథకంపై పనులపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఎంపీడీవోలు, ఏపీడీలు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు తో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. విబిజి రాంజీ పథకంలో భాగంగా 100 రోజుల నుండి 125 రోజులు పని దినములను కల్పించడం జరిగిందన్నారు. పని దినములకు సంబంధించి 60 శాతం కేంద్ర ప్రభుత్వం 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరుగుతుందని అన్నారు. పల్లె పండుగ 2.0 లో మంజూరైన సిమెంటు, తారు, డబ్ల్యుబిఎం రోడ్లను, క్యాటిల్ షెడ్లు, మ్యాజిక్ డ్రైన్లు, పనులకు సంబంధించి పూర్తి అయినవి, ఇంకా మొదలు పెట్టని పనులను జనవరి నెల 2 తేదీ నుండి 12 వ తేదీ వరకు స్థానిక ప్రజాప్రతినిధులతో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా జరిగే సమయంలో ఉపాధి పనులను నిలిపివేయటం జరుగుతుందన్నారు. నాలుగో దశ గృహ నిర్మాణాలకు సంబంధించి 37 పనులు సంబంధించి నివేదికలు సేకరించి సంబంధించిన అధికారులు జిల్లా డ్వామా పిడి కార్యాలయమునకు సమర్పించాలన్నారు.
2026 – 27 సంవత్సరానికి సంబంధించి ఎలాంటి పనులు చేపట్టిన యుక్తా ధారా క్లాత్ యాప్ ద్వారా ప్రతి పంచాయతీలో ప్లానింగ్ చేసి గుర్తించిన పనులను మాత్రమే చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.

ఈ గూగుల్ మీట్లో డ్వామా పీడి డాక్టర్.కెసిఆర్ అప్పారావు, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటరత్నం, ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.