Close

వికలాంగత్వం చూసి చలించిన జిల్లా కలెక్టర్ .. తక్షణ చర్యలకు ఆదేశాలు…

Publish Date : 08/09/2025

సోమవారం పీజిఆర్ఎస్ లో తమ సమస్యలను విన్నవించేందుకు వచ్చిన ప్రజలతో కలెక్టరేట్ ప్రాంగణమంతా హడావిడిగా ఉంది. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరానికి వెళ్లే త్రోవలో దివ్యాంగుడైన బొడ్డు రాఘవేంద్ర వీల్ చైర్ లో మెలికలు తిరిగిపోతూ ఉన్న దృశ్యాన్ని చూసి ఒక అడుగు వెనక్కి వేసి వారి వద్దకు వచ్చి ఏమైందని ప్రశ్నించారు. చిన్ననాటి నుండి ఇదే పరిస్థితి అని వీల్ చైర్ లో కూడా నిలకడగా కూర్చోపెట్టలేని పరిస్థితిఅని తెలిపారు. ఇటువంటి వ్యక్తిని ఎందుకు ఇలా ఇబ్బంది పడుతూ తీసుకొచ్చారు, మీకున్న సమస్య ఏంటి అని వివరాల అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం దివ్యాంగుల పెన్షన్ కింద రూ.6 వేలు అందుచున్నదని, ఎప్పుడో తీసుకున్న సదరం సర్టిఫికెట్ లో 45 శాతం వికలాంగత్వం మాత్రమే నమోదు చేయడంతో మెడికల్ పెన్షన్ ను అందుకోలేకపోతున్నామని, మా అబ్బాయిని చూసుకోవడం చాలా కష్టంగా ఉందని, ఎప్పుడు ఇద్దరు వ్యక్తులు పనులు మానుకుని దగ్గర ఉండి చూసుకోవాల్సిన పరిస్థితి ఉందని వాపోయారు. ఈ విషయమై చలించిన జిల్లా కలెక్టర్ వెంటనే డిసిహెచ్ఎస్ ని పిలిచి కొత్తగా సదరం సర్టిఫికెట్ మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కేసు చాలా దయనీయంగా ఉందని, ప్రత్యేక కేసు కింద ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ పంపడానికి అవసరమైన ప్రతిపాదన సిద్ధం చేస్తే నేనే సంతకం చేసి పంపించడం జరుగుతుందని ఆదేశించారు. అనంతరం వారి తల్లిదండ్రులతో మాట్లాడుతూ అధైర్య పడవద్దు అని సదరం సర్టిఫికెట్ మంజూరుకు చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రత్యేక కేసుగా సిఫార్సు చేసి లేఖను పంపడం జరుగుతుందని తెలిపారు.