Close

వాతావరణం మార్పు దృశ్య రైతులు అప్రమత్తంగా ఉండాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 21/05/2025

మంగళవారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి జిల్లాలోని ధాన్యం కొనుగోలు సేకరణ భద్రత పై జిల్లా డివిజన్ మండల స్థాయి కమిటీలతో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ మార్పులు దృశ్య రైతులకు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 6.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమును రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడం జరిగిందన్నారు. వర్షాభావం కారణంగా ఏఎంసీ గోదాములలో భద్రపరచాలని, తార్పాలిన్ తో ధాన్యమును కప్పి భద్ర పరచాలని అన్నారు. మండల స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలన్నారు. మండల స్థాయిలో ఇచ్చిన నివేదిక ప్రకారం ధాన్యం కొనుగోలు లక్ష్యాలను కేటాయించడం జరిగిందన్నారు. గోనే సంచులు విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడటం జరిగిందన్నారు. ఎక్కడ రైస్ మిల్లు వద్ద దిగుమతి విషయంలో జాప్యం లేకుండా త్వరితగతిన దిగుమతి చేయటం జరిగిందని అన్నారు. మండల స్థాయి కమిటీలు నిరంతరము శ్రమిస్తూ రైతులకు ఇబ్బంది లేకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఏమైనా సమస్యలు ఉంటే రైతు సేవా కేంద్రాలు, మండల స్థాయి అధికారులు లేదా జిల్లా టోల్ ఫ్రీ నెంబర్ 8121676653, ఫోన్ చేసి సమస్యలను పుష్కరించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు.

ఈ గూగుల్ మీట్ లో డివిజన్ అధికారులు, జిల్లా సివిల్ సప్లయ్ డిస్టిక్ మేనేజర్ టి.శివరామ ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి జెడ్..వెంకటేశ్వరరావు, జిల్లా కోపరేటివ్ అధికారి నాగరాజు, డీఎస్ఓ ఎన్ సరోజ, జిల్లాలో రెవెన్యూ డివిజన్ అధికారులు, తాహసిల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.