Close

వాణిజ్య పనులు, గనులు & భూగర్భ శాఖ, పౌర సరఫరాలు, పోలీసు శాఖలతో జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు ఆదేశాలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 13/02/2026

నిబంధనల మేరకు వాణిజ్య పన్నులు చెల్లింపులు జిల్లా, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయి..

ఆదాయ ఆర్జన శాఖలు పన్నులు వసూళ్లలో వాణిజ్య పన్నుల శాఖతో కలిసి సమన్వయంతో పనిచేయాలి

వాణిజ్య పన్నుల పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరు సకాలంలో పన్నులు చెల్లించడం ద్వారా ప్రజలకు మరింత సంక్షేమం అందించడానికి దోహదపడుతుంది

జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జిఎస్టీ సమన్వయ సమావేశాన్ని వాణిజ్య పన్నులు, ఆదాయ ఆర్జన శాఖలు అయిన రెవిన్యూ, మైన్స్ అండ్ జియాలజీ, రవాణా, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, విద్యా, ఇరిగేషన్, హౌసింగ్, ఇండస్ట్రీస్, తదితర శాఖలతో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ వివిధ రంగాల నుండి అందే ఆదాయంతో పాటు నిబంధనల మేరకు వాణిజ్య పన్నులు చెల్లింపులు ద్వారా అందే ఆదాయం జిల్లా, రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంది అన్నారు. ప్రతి ఒక్కరూ వాణిజ్య పన్నులను సకాలంలో చెల్లించాలని సూచించారు. వివిధ ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేస్తున్న పనులకు ఆయా ఏజెన్సీలు ఎంత మేరకు అని చెప్పను చెల్లిస్తున్నాయో సంబంధిత అధికారులు పరిశీలించిన మీదటే బిల్లులు చెల్లింపులు ఉండాలన్నారు. కొన్ని సందర్భాల్లో బిల్లులు ఆలస్యంగా చెల్లింపులు చేయడం జరుగుతుందని బిల్లులు జారీ సమయంలో ఆ విషయాన్ని కూడా గమనించాలి అన్నారు. ఎన్.హెచ్, రైల్వే స్, ఇరిగేషన్, డిలైట్ కంపెనీ పనులకు సంబంధించి ఆయా ఏజెన్సీలు చెల్లింపులను పరిశీలించాలన్నారు. ఏఏ అంశాలలో పన్నులు వసూలు చేయాల్సి ఉంటుందో మున్సిపల్, గ్రామపంచాయతీ అధికారులు, సిబ్బందికి ఆన్లైన్ శిక్షణను అందించాలని వాణిజ్య పన్నుల అధికారులకు సూచించారు. జిల్లాలో 14,807 రిజిస్ట్రేషన్స్ ఉన్నాయని, వారిలో 11,063 మంది క్రమం తప్పకుండా పన్నులను చెల్లించడం ద్వారా 74.65 లక్ష్యసాధన జరిగిందన్నారు. 3,754 మంది కాంపోజిషన్ టాక్స్ చెల్లింపులు 26.35 శాతంగా ఉందన్నారు. జిల్లాలో 273 టాక్స్ పేయర్స్ ద్వారా సుమారు రూ.25.65 కోట్లు బకాయిలు ఉన్నాయని వాణిజ్య పన్నుల అధికారులు తెలిపారు. ఎక్కువ మొత్తంలో పన్నులు చెల్లించవలసిన పదిమంది వివరాలను అందచేయాలని కలెక్టర్ సూచించారు. ప్రైవేటు విద్యాసంస్థలు, పాఠశాలలు, కళాశాలలు పన్నుల చెల్లింపును పరిశీలించి నివేదికను అందజేయాలని డీఈఓ ఆదేశించారు. బకాయిపడిన డిఫాల్టర్ల ఆస్తుల గుర్తింపు, జప్తుకు నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. లైసెన్సులు, పునరుద్ధరణలను జారీ చేసేటప్పుడు పన్నులు చెల్లింపులను పరిశీలించాలన్నారు. కాంట్రాక్టర్లు స్థానికంగా పెట్రోల్ అండ్ ఆయిల్స్ కొనుగోలు చేసేలా చూసుకోవాలని, తద్వారా వ్యాట్ కోల్పోకుండా అరికట్టాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణ రెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ బి.నాగార్జునరావు, డిప్యూటీ కమిషనర్ కెపి శైలజ శ్రీ, పాలకొల్లు, భీమవరం అసిస్టెంట్ కమిషనర్ డి.సాంబశివరావు, తణుకు, తాడేపల్లిగూడెం అసిస్టెంట్ కమిషనర్ కె.వి శ్రీనివాసరావు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతి రావు, డిపిఓ ఎన్.రామ్నాథ్ రెడ్డి, డీఈవో ఇ.నారాయణ, ఆర్డబ్ల్యూఎస్ శ్రీనివాసరావు, డీఎస్ఓ సరోజ, సివిల్ సప్లైస్ డి.ఎం ఎండి ఇబ్రహీం, గృహ నిర్మాణ శాఖ జి.పిచ్చయ్య, డిఎంహెచ్వో జి.గీతా బాయి, మున్సిపల్, పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.