Close

వరికి ప్రత్యామ్నాయంగా ఉద్యానవనం పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 06/02/2026

పశ్చిమగోదావరి జిల్లాలో ఘనంగా నిర్వహించిన హార్టికల్చర్ కాన్ క్లేవ్ – 2026

ఆధునిక పద్ధతులలో అధిక విలువలు కలిగిన కూరగాయలు, పువ్వుల రక్షిత సాగు మరియు కోకో, కొబ్బరి ఆధారిత ఉత్పత్తులు లక్ష్యంగా రైతులకు అవగాహన

జిల్లాలో ఉద్యానవన పంటల సాగుకు ఔత్సాహిక రైతులు ముందుకు రావాలి…

సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరుకు ఉద్యానవన శాఖ పూర్తి సహాయ సహకారాలను అందిస్తుంది…

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం టౌన్ హాల్ నందు శుక్రవారం జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “హార్టికల్చర్ కాన్ క్లేవ్ – 2026” సదస్సుకు జిల్లా కలెక్టర్ చదలగూడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సదస్సులో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ జి.ప్రభాకరరావు పాల్గొన్నారు. ఈ సదస్సు నందు ఆధునిక పద్ధతులలో అధిక విలువలు కలిగిన కూరగాయలు, పువ్వుల రక్షిత సాగు మరియు కోకో, కొబ్బరి ఆధారిత ఉత్పత్తులు లక్ష్యంగా ఉద్యానవన రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ సదస్సుకు వెంకట్రామన్నగూడెం ఉద్యాన యూనివర్సిటీ, కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం నుండి శాస్త్రవేత్తలు, ఉద్యానశాఖ ప్రధాన కార్యాలయం నుండి అధికారులు పాల్గొని వివిధ అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి మూడు నెలలకు ఒకసారి తాడేపల్లిగూడెం, ఆచంట నియోజకవర్గ స్థాయిలో కూడా నిర్వహించుకుంటే రైతులకు అవగాహన కలిగి ఉద్యానవన పంటల సాగుకు ముందుకు వస్తారన్నారు. మనకి ఆర్థికంగా బలమైన రైతులు ఉన్నారని, కేవలం వారికి అవగాహన కల్పించడం ద్వారా సాగుకు ముందడుగు వేస్తారన్నారు. మన జిల్లాలో అత్యధికంగా వరి పండిస్తాం, అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేస్తాం అనే పేరు ఉందని, అలాగే మన జిల్లాలో హార్టికల్చర్ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉన్నారని నిరూపించడానికి తణుకుని ఆనుకుని ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఒక అభ్యుదయ రైతు ఆర్ కిడ్స్ అంటే వెరీ హై వేల్యూ ఫ్లవర్స్ సాగు చేస్తున్నారన్నారు. బహుశా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆర్కిడ్స్ కల్టివేషన్ లేదన్నారు. ఒక ఫ్లవర్ సుమారు రూ.50/- నుండి రూ.200/- వరకు ఉంటుందన్నారు. వీటిని పెద్ద వేడుకలలో డెకరేషన్స్ కు వాడతారని, ఎక్స్పోర్ట్ చేస్తున్న వ్యక్తి చాలా మంచి ప్లాంట్స్, మంచి వెరైటీస్ అన్ని తీసుకొచ్చి పెట్టారని తెలిపారు. ఇవి బెంగుళూరు, హైదరాబాదు వంటి నగరాల్లో బాగా విస్తరించి ఉన్నాయని, హైడ్రోపోనిక్ కల్టివేషన్ వలన చాలా లాభాలు ఉన్నాయని, తక్కువ విస్తీర్ణంలో, ఎటువంటి సాయిల్ కండిషన్స్ ఉన్న సాగు చేయవచ్చు అన్నారు. మన జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాలలో ఖరీఫ్, రబీలలో వరి సాగు చేస్తున్నామని, వాతావరణ పరిస్థితులు కారణంగా నష్టాలు కూడా రైతులు ఎదుర్కొంటున్నారన్నారు. ఉద్యానవన పంట మార్పిడిపై దృష్టి సారిస్తే అధిక లాభాలను పొందవచ్చుఅని తెలిపారు. అలాగే మన జిల్లాలో 15 వేల ఎకరాలలో కొబ్బరి సాగు జరుగుచున్నదని, మధ్యలో కోకో కూడా వేస్తున్నారన్నారు. ఆధునిక పద్ధతులతో లాభసాటి పంటల సాగుకు మంచి శిక్షణతో హై వాల్యూ వెజిటబుల్స్, ఫ్రూట్స్ సాగు చేయడానికి ఈరోజు వర్క్ షాప్ పెట్టుకోవడం జరిగిందని, అలాగే వీటి సాగుకు ఉన్న పథకాలను కూడా వివరించడం జరుగుతుందన్నారు. మన జిల్లాలో కోకో ఉత్పత్తులతో చాక్లెట్స్ తయారు చేస్తున్నారని రెండు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మన జిల్లాలోని ప్రొడక్ట్స్ మొదలుపెట్టి తాడేపల్లిగూడెంలో ఒకటి, ఉండి మండలం మహాదేవపట్నంలో ఏర్పాటుచేసి, దానివల్ల మంచి లాభాలు రావడం కూడా జరుగుతుందని వివరించారు. కోకోనట్ మిల్క్ వంటల్లో వాడుతున్నారని తెలిపారు. నెక్స్ట్ జనరేషన్ యువకులు ఇటువంటి ఉత్పత్తులపై దృష్టి సారించాలన్నారు. ఒకవేళ మీరు ఏదైనా యూనిట్ పెట్టుకోవడానికి వస్తే బ్యాంక్స్ నుంచి టైప్ చేయడానికి మేము అన్ని రకాలుగా సహకరించడం జరుగుతుందని తెలిపారు. మన జిల్లాలో కూరగాయల సాగు కూడా తక్కువగా ఉందని మనకు కావాల్సిన ఉత్పత్తులన్నీ వేరే ప్రాంతం నుండి తెచ్చుకోవడం జరుగుతుందన్నారు. ఈ రంగంలోకి మనం ఎంత ఎక్కువ మంది రైతులను ప్రోత్సహిస్తే అంత అభివృద్ధి సాధించవచ్చని ఉద్యానవన అధికారులకు సూచించారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మన ఆదాయం పెరిగినప్పుడు మన ఆహార అలవాట్లు గాని, మనం వాడే వస్తువులు కానీ మారుతూ వస్తాయన్నారు. దీంట్లో ముఖ్యంగా ఫ్రూట్స్, ఆర్గానిక్ కూరగాయల వినియోగం ఎక్కువగా పెరిగిందన్నారు. ఇక్కడ తెలియజేసిన అవకాశాలు, సైంటిస్ట్ లు, రైతుల ఆలోచనలు చిన్న పుస్తకం రూపంలో తీసుకువస్తే అవసరమైన ప్రచారానికి బాగుంటుందని సూచించారు. ఆయిల్ ఫామ్ ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది, మన దగ్గరే సాగుకు కావాల్సిన సమాచారం, పాలసీలు, నేషనల్ ఫర్ ఆయిల్ ఫామ్ దాని నుంచి వచ్చే ఇన్సెంటివ్ లు ప్రతి ఒక్క రైతు కూడా తెలుసుకొని ఉపయోగించుకుంటారన్నారు. ఉదాహరణకు కోకోనట్ మిల్క్ తో ఇప్పుడు వేగాలని కాన్సెప్ట్ వచ్చింది ఏంటంటే ఆవు పాలును ఎక్కువగా వినియోగిస్తున్నారు. గోదావరి బెల్ట్ అంతా కూడా మనం హార్టికల్ డెవలప్ చేసుకోవచ్చు, ఇక్కడ అనుకూలమైన వాతావరణం ఉంది. రైతుకి సాంప్రదాయంగా వచ్చే ఆదాయంకి ప్రత్యామ్నాయంగా చేదోడుగా ఉద్యాన కొనసాగు పనిచేస్తుందన్నారు.

కొవ్వూరు రీజనల్ హార్టికల్చర్ రిసోర్స్ స్టేషన్ సీనియర్ ప్రొఫెసర్, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ వి.శివకుమార్ ఉద్యానవన సాగులో హైడ్రోపోనిక్స్, పోలి హౌసెస్, ఫ్లడ్ అండ్ డ్రైన్, డిప్ వాటర్ కల్చర్, డ్రిప్ సిస్టం, విక్ సిస్టం, ఏరో ఫోనిక్స్, ఆక్వా ఫోనిక్స్, పాన్ అండ్ ప్యాడ్ కూలింగ్ సిస్టం ల ఏర్పాటు ద్వారా కూరగాయలు, పండ్ల తోటలు, పూల సాగు, మెళుకువలను క్షుణంగా వివరించారు. పలు రైతులు వెలుబుచ్చిన సందేహాలకు సమాధానాలను తెలియజేశారు.

సదస్సు సందర్భంగా ఏర్పాటుచేసిన ఫల, పుష్ప ప్రదర్శన ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నది.

ఈ సదస్సులో రాష్ట్ర ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ జి.ప్రభాకర్ రావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎం.హరి ప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి పి.శ్రీలక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ ఏ.నాగేంద్ర ప్రసాద్, ఉద్యానవన రైతులు, ఔత్సాహిక రైతులు, ఉద్యానవన సహాయకులు, తదితరులు పాల్గొన్నారు.