• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

వరద బాధితులకు అండగా పశ్చిమగోదావరి జిల్లా రెవెన్యూ అసోసియేషన్ మరియు ఉద్యోగులు

Publish Date : 12/09/2024

విజయవాడ వరద బాధితుల సహాయార్థం పశ్చిమగోదావరి జిల్లా రెవిన్యూ అసోసియేషన్ మరియు ఉద్యోగులు తరుపున వీఆర్ఏ స్థాయి ఉద్యోగి నుండి తాసిల్దార్ స్థాయి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.7,54,030 రూపాయలు చెక్కును గురువారం కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లా రెవిన్యూ సిబ్బంది తరపున వరద బాధితులకు సహాయార్థం చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించటం అభినందనీయమని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా రెవెన్యూ ఉద్యోలు కిందిస్థాయి ఉద్యోగం నుండి తాహసిల్దార్ స్థాయి వరకు పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులు ఉద్యోగ నిర్వహణలో ప్రజలకు అందించే సేవలతో పాటు ఆపద కాలంలో ఉన్న వారిని సహృదయంతో ఆదుకోవడం అభినందనీయమని అన్నారు.

ఈ సందర్భంలో డిఆర్ఓ జె.ఉదయ భాస్కరరావు, పశ్చిమగోదావరి జిల్లా రెవిన్యూ అసోసియేషన్ సభ్యులు, తాహసిల్దార్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.