Close

వందేమాతరం రైలు ప్రయాణం వర్తక, వాణిజ్య వ్యాపారాలకు, తీర ప్రాంత మత్స్య పరిశ్రమ అభివృద్ధిలో కోస్తా జిల్లా మణిహారంగా నిలుస్తుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అన్నారు.

Publish Date : 15/12/2025

సోమవారం నరసాపురం రైల్వే స్టేషన్ నుండి వందే భారత్ రైలు ప్రయాణాన్ని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అశేష జనవాహిని మధ్య లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీo అస్మి, నరసాపురం, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ లు బొమ్మిడి నాయకర్, బొలిశెట్టి శ్రీనివాస్, భీమవరం శాసనసభ్యులు మరియు పి ఎస్ సి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, రాష్ట్ర మహిళా ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ షరీఫ్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ వర్తక, వాణిజ్య వ్యాపారాలకు, మత్స్య పరిశ్రమ అభివృద్ధికి వందేమాతరం రైలు నరసాపురం వరకు పొడిగింతో ఈ ప్రాంతం విశేషంగా అభివృద్ధి చెందుతుందన్నారు. చదువుకునే వారికి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు చెన్నై వెళ్లే వారికి చాలా బాగుంటుంది అన్నారు. మత్స్య పరిశ్రమ పురోభివృద్ధి చెందాలంటే రైలు కనెక్టివిటీ చాలా ముఖ్యమన్నారు. చెన్నై కి వెళ్లాలంటే ఉంది భారత్ రైలు ద్వారా తొమ్మిది గంటల వ్యవధిలోనే చేరుకోవచ్చు అన్నారు. హైదరాబాద్, బెంగళూరు వెళ్లే వందే భరత్ రైలు కూడా నర్సాపురం వచ్చి వెళ్లేలా సంబంధిత కేంద్ర మంత్రితో, అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే వందే భారత రైలు తాడేపల్లిగూడెంలో కూడా ఆగేలా ఏర్పాటు చేస్తానన్నారు. తాడేపల్లిగూడెంలో ఆర్ యు బి లు నిర్మాణంలో ఉన్నాయని, 48 ప్రాంతాలలో రైల్వే క్రాసింగ్ ల వద్ద ఆర్ యు బి లు, ఆర్ఓబీలు నిర్మాణాలకు గుర్తించడం జరిగిందన్నారు. జిల్లా అభివృద్ధికి నరసాపురం లూప్ లైన్ లో ఉన్న ప్రాంతాన్ని కూడా కలుపుతూ రైళ్లు ప్రయాణించేలా చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు, ఎస్.సి రైల్వే అడిషనల్ జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, నరసాపురం, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మరియు ప్రభుత్వం విప్ లు బొమ్మిడి నాయకర్, బొలిశెట్టి శ్రీనివాస్, భీమవరం శాసనసభ్యులు మరియు పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, రాష్ట్ర ఏపిఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్ పర్సన్ పీతల సుజాత, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఎంఎ షరీఫ్, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, మాజీ ఎమ్మెల్యే లు బండారు మాధవ నాయుడు, కొత్తపల్లి జానకిరామ్, ఆర్డీవో దాసిరాజు, విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాక్య, ఏ.డి.ఆర్.ఎం ఆపరేషన్స్ కొండా శ్రీనివాసరావు, చీఫ్ పిఆర్ఓ శ్రీధర్, తహసిల్దార్ ఐయితం సత్యనారాయణ, మున్సిపల్ చైర్ పర్సన్ బర్రె శ్రీ వెంకట రమణ, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.