Close

లేసు అల్లికలు ప్రపంచంలోనే మేటిగా నిలిచేలా మంచి నాణ్యతతో తయారుచేస్తే, మెరుగైన మార్కెటింగ్ లభిస్తుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Publish Date : 29/03/2025

శనివారం నరసాపురం మండలం రుస్తుం బాధ గ్రామంలోని సీతారాంపురం లేస్ పార్కును జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి సందర్శించారు. ఎగుమతులు, దిగుమతులు కార్యకలాపాలు నిర్వహించే బాంబే ఎగ్జిమ్ బ్యాంకు సౌజన్యంతో లేస్ అల్లికదారులకు మెరుగైన శిక్షణను కల్పించి, శిక్షణను పూర్తి చేసుకున్నవారికి సర్టిఫికెట్లు అందించే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత లేస్ పార్క్ నందు ఏర్పాటుచేసిన లేసు అల్లికలలో నైపుణ్యాన్ని పెంపొందించే శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించారు. నేటి నుండి ప్రారంభించిన తొలి బ్యాచ్ లో 20 మంది మహిళలకు లేసు అల్లికలలో శిక్షణను ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ఎగ్జిమ్ బ్యాంక్స్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన అవుట్ రీచ్ – కమ్ – కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం కార్యక్రమానికి హాజరై ఇప్పటికే లేసు అల్లికల నందు శిక్షణ పొందిన మహిళలను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ నిత్యము ఉపయోగించే వస్తువులను లేసు ఉత్పత్తులతో తయారు చేస్తే మార్కెటింగ్ బాగుంటుందని సూచించారు. ఎక్కడో బాంబేలో ఉండే ఎగ్జిమ్ బ్యాంక్ నరసాపురం లోని మన లేసు ఉత్పత్తులను ఎంపిక చేసుకొని శిక్షణ, మార్కెటింగ్ అందించడానికి ముందుకు రావడం ఎంతో గొప్ప విషయం అన్నారు. ఇప్పటికే నరసాపురం లేసుకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చే జిఐ గుర్తింపు సర్టిఫికెట్ను పొందడం జరిగిందన్నారు. గుర్తింపుకు కొదవలేదని అయితే నాణ్యతతో కూడిన నిత్యవసర వస్తువుల వినియోగ అల్లికలకు మంచి మార్కెటింగ్ ఉంటుందని, తద్వారా మంచి ఆదాయం కూడా లభిస్తుంది అన్నారు. ఆధునిక టెక్నాలజీతో ఇప్పటివరకు మీరందరూ శిక్షణను తీసుకున్నారని, అల్లికకు రంగు దారాల ఎంపికలో నైపుణ్యం చూపించాలన్నారు. జిల్లా యంత్రాంగం పరంగా మీకు అవసరమైన సహాయ సహకారాలను ఎల్లప్పుడూ అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

చివరిగా శిక్షణ పూర్తి చేసుకున్న లేసు అల్లికదారులకు సర్టిఫికెట్లను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, లవ్లీ హుడ్స్ డిపిఎం మరియు లేస్ పార్క్ మేనేజర్ ఎస్.కుసుమకుమారి, ఎగ్జిమ్ బ్యాంక్ జనరల్ మేనేజర్ ధర్మేంద్ర సచాన్, చీఫ్ మేనేజర్ కౌశలాల్ గిరి, ఏటీడీసీ ప్రిన్సిపాల్ బి.విజయలక్ష్మి, సర్పంచ్ ఎం.భారతి, తదితరులు పాల్గొన్నారు.