Close

లేసు అల్లికదారులు ఆర్థిక స్వావలంబన దిశగా పైనించాలి…..జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 20/05/2025

లేసు అల్లికలలో వినియోగదారులు అభిరుచికి అనుగుణంగా కొత్త డిజైన్లు రూపొందించాలి..

మంగళవారం నరసాపురం మండలం రుస్తుంబాధ అలంకృతి లేసు పార్కును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుచున్న డిజైన్ వర్క్ షాప్ లో పాల్గొని లేస్ అల్లికల మీద శిక్షణ పొందుచున్న మహిళలు అల్లిన పలు విధాల లేసు డిజైన్లను ఆమె పరిశీలించారు. లేస్ అల్లికల శిక్షణ పొందే మహిళలు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో మాట్లాడి పలు సూచనలు సలహాలను ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ లేసు అల్లికలలో మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా పయనించాలని అన్నారు. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా కొత్త డిజైన్లను రూపొందించాలని అన్నారు.
ప్రత్యేకించి గృహాలలో అలంకరించుకునే లేస్ డిజైన్లను, టేబుల్ పై వేసుకునే డిజైన్లు, పిల్లలు, మహిళలు, ధరించే లేస్ డిజైన్లపై ఎక్కువ దృష్టి సారించాలని అన్నారు. అల్లిన లేసు దుస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. తద్వారా ఇక్కడ కంటే మార్కెట్లో రేటు ఎక్కువ రేటు లభిస్తుందని అన్నారు. లేసు అల్లిక మహిళలు ఆర్థికగా బలపడేందుకు ప్రభుత్వపరంగా సహకారం అందిస్తామన్నారు. కుట్టు డిజైన్ అల్లికలలో మహిళలు ఎక్కువగా డిజైన్ అల్లికలలో పాల్గొని శిక్షణను సద్వినియోగం చేసుకోనీ మంచి మంచి ప్రోడక్ట్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో దాసిరాజు, జిల్లా డిఆర్డిఏ పిడి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, తహసిల్దార్ అయితం సత్యనారాయణ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, లేసు శిక్షణ మహిళలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

1.11