Close

రైతు హక్కులను కాపాడటమే లక్ష్యంగా పాస్ పుస్తకాలు అధికారికంగా పంపిణీ చేస్తుంది–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 17/01/2026

భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పారదర్శకంగా చర్యలు తీసుకుంటుంది

రైతులు తమ భూమికి సంబంధించిన వివరాలను పాసు పుస్తకాల ద్వారా సులభంగా తెలుసుకోవచ్చని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు.

శనివారం ఆచంట మండలం పెనుమంచిలి గ్రామ సచివాలయం వద్ద జరిగిన గ్రామ సభకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టాదారు పాసు పుస్తకములను పరిశీలించారు. గ్రామ సభకు హాజరైన రైతులతో ఆయన మాట్లాడారు. రైతులు యొక్క సందేహాలను నివృత్తి చేసి పలు సూచనలు సలహాలను తెలిపారు. గ్రామ సభ నుండి ఫోన్ ద్వారా నేరుగా ఒక రైతుతో మాట్లాడారు. గ్రామంలో గ్రామసభ పెట్టినట్లు మీకు తెలుసా, మీకు ఎంత భూమి ఉంది, పాసు పుస్తకము తీసుకున్నారా అని అడిగారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పారదర్శకంగా చర్యలు తీసుకుంటుంది అన్నారు. రైతు హక్కులను కాపాడటమే లక్ష్యంగా పాసు పుస్తకాలను అధికారికంగా పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. భూమి రికార్డులు స్పష్టంగా ఉండటం వల్ల రైతులకు చట్టపరమైన భద్రత లభిస్తుందని, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు రుణాలు సబ్సిడీలు పొందడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులు సంప్రదించాలని సూచించారు. పాసు పుస్తకాలు తీసుకున్నవారు తప్పులు సరి చేయుటకు, ఇంకా పాసు పుస్తకములు లేని వారు పొందడానికి అర్జీలను పెట్టుకోని సర్వే చేయించుకోవాలన్నారు. అందరికీ మూడు నెలల లోగా పుస్తకాలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఆన్లైన్ విధానమును పరిశీలించారు. డ్రోన్ ద్వారా సర్వే చేసిన జి ఫోటోను (జి పి ఎస్) రైతుకు చూపించి. మీ స్థలం కరెక్ట్ గా ఉందా అని అడిగారు,
రైతులకు ఉన్న సమస్యలు తెలియజేస్తే వాటిని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు . గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామసభలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి రైతులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఎం.సోమేశ్వరరావు, సిబ్బంది రైతులు, తదితరులు ఉన్నారు.