Close

రైతు సేవా కేంద్రం ద్వారా రైతులు ధాన్యాన్ని అమ్మి మద్దతు ధర పొందాలి, పిల్లలను బాగా చదివించాలి.. జిల్లా కలెక్టర్ నాగరాణి

Publish Date : 17/04/2025

బుధవారం పెద్ద తాడేపల్లి రైతు సేవా కేంద్రమును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించి రైతులతో మాట్లాడారు. దాన్యం కొనుగోలు కేంద్రాలు పనితీరు గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు సకాలంలో జరుగు జరుగుచున్నవన, 24 గంటల వ్యవధిలో ఎకౌంట్లో డబ్బులు పడుతున్నాయని అని తెలుసుకున్నారు. గోనెసంచులు సరఫరాలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. ఎటువంటి ఇబ్బందులు లేవని అధికారులు సకాలంలో సహకరిస్తున్నారని చెప్పారు. ఇంత త్వరగా డబ్బులు ఎకౌంట్లో జమ కావడం ఇంతకుముందు ఎన్నడూలేదని, డబ్బులు కోసం నెలలు తరబడి ఎదురుచూసిన పరిస్థితిఅని, ఇప్పుడు మిల్లుకు వెళ్లిన రోజునే డబ్బులు పడటం జరుగుతుందని చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. సకాలంలో డబ్బులు పడితే ఆర్థిక భారం కూడా పడదని, లేకపోతే గతంలో డబ్బులు పడేలోపు వడ్డీకి తెచ్చుకునే పరిస్థితి ఉండేదని తెలిపారు. గంగాధర్ అనే రైతు దాన్యం పట్టుబడి జరుగుచున్న కల్లం వద్దకు వెళ్లి కలెక్టర్ ధాన్యం పట్టుబడిన పరిశీలించారు. రైతులతో మాట్లాడారు ఏ రకాలను సాగు చేశారు. ఎంత దిగుబడి వచ్చింది అడుగగా ఎం టి యు 1121 వరిసాగు చేయటం జరిగిందని, ఎకరాకు 50 నుండి 52 బస్తాల వరకు దిగుబడి వచ్చిందని జిల్లా కలెక్టర్ కు రైతు గంగాధర్ తెలిపారు. ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఇబ్బందులు లేవని సంతృప్తి వ్యక్తం చేశారు. మీ పిల్లలు ఏమి చదువుతున్నారు. ఎక్కడ చదువుతున్నారు. అని రైతులను ఆరా తీయగా కొంతమంది రైతులు మా పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారని, చాలా తక్కువ మంది రైతులు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారని తెలుపగా, కలెక్టరు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల్లో చదివించి ప్రభుత్వం నుండి వచ్చే అన్ని ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రైతులతో అన్నారు.

ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, వ్యవసాయ సహాయ సంచాలకులు పి. మురళీకృష్ణ, ఏడిఏలు శశి బిందు, హేమ కుమారి, ఎం ఏ ఓ ఆర్ఎస్ ప్రసాద్ వి ఏ ఏ అలేఖ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.