Close

రైతు బాగుంటేనే జిల్లా, రాష్ట్రం, దేశం బాగుంటాయని, రైతుకు బాసటగా నిలిచేందుకు జిఎస్టి స్లాబులను మదింపు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Publish Date : 01/10/2025

బుధవారం తాడేపల్లిగూడెం ఎస్వీఆర్ సర్కిల్ నందు సూపర్ జీఎస్టీ ..సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా వాణిజ్య పన్నులు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వ్యవసాయ పనిముట్లు, యంత్ర పరికరాల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు జీఎస్టీ నోడల్ అధికారి టి.రాహుల్ కుమార్ రెడ్డి ప్రారంభించి, తిలకించారు. జిఎస్టి తగ్గింపుకు ముందు తర్వాత రైతులకు కలిగిన ఆర్థిక ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిఎస్టి సవరించిన రేట్లు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వచ్చాయని, పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు, రైతుల సంక్షేమానికి దోహదపడుతుందన్నారు. జీఎస్టీ స్లాబులు తగ్గింపుతో వివిధ వస్తువులు, సేవల తగ్గడం వలన కలిగే ప్రయోజనాల గురించి లబ్ధిదారుల్లో అవగాహన పెంచడానికి ఒక నెల రోజులు పాటు ప్రచారాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ లో భాగంగా, వ్యవసాయ రంగం, వ్యవసాయ అనుబంధ రంగాలలో ప్రయోజనాలను వివరిస్తూ.. ట్రాక్టర్లకు GST 12% నుంచి 5% కు తగ్గినది మరియు ట్రాక్టర్ విడిభాగాలు, టైర్లు, హైడ్రాలిక్ పంపుల పన్ను 18% నుంచి 5% కు తగ్గిందన్నారు. ఎరువుల ముడి పదార్ధాలపై 18% నుంచి 5 % వరకు, బయో -పురుగు మందులు మరియు సూక్ష్మ పోషకాలపై 12 % నుంచి 5% వరకు తగ్గాయన్నారు. సౌర శక్తితో నడిచే పరికరాల మీద కూడా 12 % నుంచి 5% నికి తగ్గించడం జరిగిందని, స్ప్రింక్లర్లు, బిందు సేద్యం ఫ్రెషర్లు, కంపోస్ట్ యంత్రాలపై జిఎస్టి 5 % కి తగ్గిందన్నారు. క్షీర పరిశ్రమలో పాలు మరియు చీజ్ పై జీఎస్టీ లేదని, వెన్న మరియు నెయ్యి మీద 12 % నుంచి 5 % వరకు జీఎస్టీ ని తగ్గించడం జరిగిందన్నారు. ఆహార శుద్ధి పరిశ్రమలో తయారుచేసిన, నిలువ చేసిన కూరగాయలు, పండ్లు, గింజలపై 12 శాతం నుంచి 5% వరకు తగ్గిందని, ఆక్వాకల్చర్ మరియు తేనెటీగల పెంపకం, చేపల ఉత్పత్తులపై 12 % నుంచి 5 % శాతంకి జిఎస్టి తగ్గించబడినదని తెలిపారు. సహజ సిద్ధమైన తేనెపై జీఎస్టీ తగ్గించడం వల్ల తేనెటీగల పెంపకం చేసే వారికి ప్రయోజనం కలుగుతుందన్నారు. జిఎస్టీ తగ్గించడం కారణంగా రైతులు వ్యవసాయ పనిముట్లు మరియు వ్యవసాయ ఉత్పత్తులను తక్కువ ధరకే పొందగలుగుతారన్నారు. దీని ఫలితంగా వ్యవసాయ ఖర్చులు తగ్గి, అధిక దిగుబడిని సాధించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకత, గ్రామీణ ఆదాయం, ఆహార భద్రత మెరుగుపడతాయని తెలిపారు.

తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జిఎస్టి స్లాబులు తగ్గింపు కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోయినప్పటికీ రైతులకు, సామాన్య మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుందనే ధ్యేయంతో మన ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్నారు. అన్ని వర్గాల ప్రజలు, రైతులు జీఎస్టీ ఆర్థిక ఫలాలను పొంది, ఆర్థికంగా లాభపడాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు జీఎస్టీ మోడల్ అధికారి టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఏలూరు డివిజన్ వాణిజ్య పన్నుల డిప్యూటీ కమిషనర్ కెపి శైలజ శ్రీ, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ జెడ్.వెంకటేశ్వరరావు, వాణిజ్య పన్నుల శాఖ భీమవరం, తణుకు సర్కిల్స్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్లు వి.కేదారేశ్వర రావు, కె.వి.శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, ఇన్చార్జి తహసీల్దార్ ఎ.కాళీ కృష్ణ, భవన నిర్మాణ శాఖ చైర్మన్ వలవల బాబ్జి, భారతీయ జనతా పార్టీ కన్వీనర్ ఈతకోట తాతాజీ, వర్తనపల్లి కాశి, పుల్లా బాబి, ముత్యాల ఆంజనేయులు, ఆకాశపు స్వామి, అధికారులతో పాటు కూటమి నాయకులు కార్యకర్తలు, పలువురు ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.