Close

రైతు బజార్ లో కూరగాయలు, పండ్లు, నిత్యవసర వస్తువులు ధరలు, రైతుబజార్ నిర్వహణ, వినియోగదారులతో రైతుల ప్రవర్తనపై ప్రజాభిప్రాయం సేకరణ సంతృప్తికరంగా ఉంది–జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 05/01/2026

భీమవరం రైతు బజార్లో వినియోగదారులు డిజిటల్ చెల్లింపులకు ప్రతి దుకాణం ముందు క్యూఆర్ కోడ్ డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేయాలి.

జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సూచనల మేరకు భీమవరం రైతు బజార్ లో కూరగాయలు, నిత్యవసర వస్తువుల ధరలు, రైతు బజారుల నిర్వహణ, పరిశుభ్రత పై ప్రజల నుండి ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫిర్యాదులు బాక్స్ ను సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ చాంబర్ నందు ఓపెన్ చేసి ప్రజల నుండి వచ్చిన అభిప్రాయాలను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. బహిరంగ మార్కెట్ కన్నా రైతు బజార్లో ధరలు తక్కువగా ఉన్నాయని వినియోగదారుల అభిప్రాయాన్ని గమనించడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతు బజార్లో విక్రయించే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, నిత్యవసర సరుకులు ఎప్పటికప్పుడు నాణ్యతను పరిశీలించాలని మార్కెటింగ్ శాఖ అధికారులు ఆదేశించారు. రైతు బజార్లోని ప్రతి దుకాణంలో యూపీఐ చెల్లింపులు జరిగే విధంగా క్యూఆర్ కోడ్ డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. దీనిపై దుకాణదారులకు అవగాహన కల్పించాలన్నారు. డిజిటల్ చెల్లింపుల ద్వారా చిల్లర సమస్య తీరుతుంది అన్నారు. రైతు బజార్లో ఒక దుకాణదారుడు అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదు మేరకు ఆ దుకాణాన్ని నిలుపుదల చేయవలసిందిగా జాయింట్ కలెక్టర్ రైతు బజార్ ఎస్టేట్ అధికారి ఆదేశించారు. రైతు బజార్లో నిర్ణయించిన ధరలకే అమ్మకాలు జరగాలని, ఎవరైనా అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు.

ఈ సందర్భంలో జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎం.సునీల్ కుమార్, రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ పి.కళ్యాణ్ ఉన్నారు.