• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

రైతు బజార్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జేసి

Publish Date : 06/07/2025

వినియోగదారులకు సరసమైన ధరల్లోనాణ్యమైన కూరగాయలు, సరుకులు అందజేయాలని ఆదేశం

జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి*

భీమవరం పట్టణంలో ఉన్న రైతు బజార్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతు బజార్ అంతా కలియ తిరిగారు. రైతు బజార్ లో లభ్యమవుతున్న కూరగాయలు, పండ్లు, ఆకు కూరలు, నిత్యవసర సరుకులు షాపులను పరిశీలించారు. వాటి నాణ్యతపై ఆరా తీశారు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తాజాగా ఉండాలని వ్యాపారస్తులకు సూచించారు. కూరలు కొన్న వినియోగదారులతో మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. బోర్డు మీద ఉన్న ధరలకే కూరగాయలు అందుతున్నాయాఅని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు సరస్వమైన ధరలలో నాణ్యమైన కూరగాయలు, సరుకులను అందించుటకే ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేయడం జరిగిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది రైతు బజారు బయట నిర్వహిస్తున్న షాపులను వెంటనే ఖాళీ చేపించి లోపల అమ్ముకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. రోడ్డు పై ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ సి ఐ ను ఆదేశించారు. రైతు బజార్ లో షాపులు పై కప్పులు పాడైపోయి ఉండడం గమనించిన ఆయన వెంటనే రైతు బజార్ మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు, షాపులు పై కప్పులు, ఇంటర్నల్ డ్రైనేజీ రిపేరు చేయుటకు ప్రతిపాదనలను తయారుచేసి నిధులు మంజూరు కోసం చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ ఏడి కి సూచించారు. పాడైయున్న ఎల్ ఈడి బోర్డు తక్షణం రిపేర్ చేయించాలని, త్రాగునీరు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని. మరుగుదొడ్లు , ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయించి శుభ్రముగా ఉంచాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులు ను ఆదేశించారు.

ఈ సందర్భంలో మార్కెటింగ్ ఎడి కె.సునీల్ కుమార్, రైతు బజార్ ఎస్టేట్ అధికారి పి.కళ్యాణ్, తదితరులు ఉన్నారు.