రైతుల సమస్యలను తెలుసుకుని తప్పులు లేని రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలు రైతులకు అందించడానికి ఈ గ్రామ సభల ముఖ్య ఉద్దేశం–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
రైతుల భూ సమస్యల పరిష్కారానికి జాయింట్ కలెక్టర్ శిరగాలపల్లి గ్రామంలో రాత్రి బస..
రైతులు తమ భూ సమస్యలను నా దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి
తప్పులు సరిచేసి రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు జారీకి రైతులు దరఖాస్తు చేసుకునేందుకు ముందుకు రావాలి.
యలమంచిలి మండలం శిరగాలపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన మీ భూమి – మీ హక్కు గ్రామసభలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకముల పంపిణి పై అవగాహన కొరకు గ్రామ సభను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ శిరగాలపల్లి గ్రాముములో 2023 సం.ము నందు జరిగిన రీ సర్వే పూర్తయినదని, ఇందులో భాగముగా మొత్తం 675 మంది రైతుల భూములను రీ సర్వే చేసి కొత్తగా సర్వే నెంబర్ల స్థానములో ఎల్ పి ఎం నెంబర్లు కేటాయించడం జరిగిందని,
రీ సర్వే అయిన పిదప పట్టాదారు పాస్ పుస్తకములలో దొర్లిన పొరపాటులు జాయింట్ ఎల్పిఎం నెంబర్లు, ఫోటోల ముద్రణ తప్పుగా జరిగినవి, ఆధార్ నెంబర్లు తప్పుగా ఉన్నవి, మొబైల్ నెంబర్లు తప్పుగా ఉన్నవి, విస్తీర్ణం లో వ్యత్యాసములు ఉన్న పొరపాటులను సరిచేయించుకొనుటకు రైతులు ముందుకు రావాలన్నారు. ఈరోజు రాత్రి బస కూడా ఈ గ్రామంలోనేనని, రైతులకు అందుబాటులో ఉంటానని తెలియజేసారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు ఈకేవైసీ చేయించుకొని పాస్ పుస్తకాలు పొందాలని సూచించారు. ఫిబ్రవరి నెలలో ఏ తప్పులు లేకుండా రైతులకు కొత్త పాస్ పుస్తకాలు పొందేందుకు ప్రతి ఒక్కరు మీ రికార్డులు సరిచూసుకోవాలని రైతులకు సూచించారు. ఈ సందర్భంగా రైతులు గ్రామంలో భూ వ్యత్యాసాలకు సంబంధించి ఎక్కువ సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని కోరారు. ఆధునిక పరిజ్ఞానంతో రైతుల భూ సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో నర్సాపురం ఆర్డిఓ దాసి రాజు, తహసీల్దార్ గ్రంధి పవన్, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ పి.శ్యాంసుందర్, గ్రామ సర్పంచ్ చంద్రాపౌల్, సొసైటీ ప్రెసిడెంట్ చిలికురి బాలాజీ, మాజీ సర్పంచ్ సీతారాం, మండల సర్వేయర్, సచివాలయ సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.