Close

రైతులు భూములకు ఖచ్చితమైన హద్దులను గుర్తించి రికార్డులు ఆధునీకరించేందుకే రీ సర్వే నిర్వహించటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు

Publish Date : 01/03/2025

తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెంలో రీ సర్వే గ్రౌండ్ ట్రూతినింగ్ పనులను, సరిహద్దుల మ్యాపులను శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ నేలపైన వేసిన బరకం పై కూర్చుని రైతులతో రీ సర్వే గ్రామసభలో పాల్గొన్నారు. తొలుత రైతులతో మాట్లాడుతూ రీ సర్వే ప్రయోజనాలను వివరించి, వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. అధికారులు ముందుగా మీకు నోటీసులు అందజేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. రీ సర్వే పనులకు సంబంధించి రైతులు అధికారులకు సహకరించాలని అన్నారు. దస్తావేజులలో తప్పులు ఏమైనా ఉంటే అధికారులు దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రైతులు భూములకు ఖచ్చితమైన హద్దులు గుర్తించి ప్రయోగాత్మకంగా రీ సర్వే నిర్వహించటం జరుగుచుదన్నారు. సర్వే నిర్వహించే ముందు భూ యజమానులకు తెలియజేయాలని వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని అధికారులకు సూచించారు. రైతులు అభ్యంతరాలు ఏమైనా తెలియజేస్తే నమోదు చేసుకోవాలని అన్నారు. రైతులు భూములకు ఖచ్చితమైన హద్దులను గుర్తించి రికార్డులు ఆధునీకరణ చేసేందుకు ప్రయోగాత్మకంగా తప్పులు లేకుండా సర్వే నిర్వహిస్తున్నారన్నారు. రైతులకు ముందుగా సమాచారం అందించిన తర్వాతే సర్వే నిర్వహించాలన్నారు. రైతులు అభ్యంతరాలను ప్రామాణికంగా తీసుకుని వాటిని నివృత్తి చేయాలని అన్నారు. దస్తావేజులు తప్పులు ఉంటే సరిచేయాలని సూచించారు.

గృహ నిర్మాణాలకు లబ్ధిదారులను ప్రోత్సహించాలి.. జిల్లా కలెక్టర్

నవాబుపాలెం గ్రామంలో పేదల లేఔట్ ను పరిశీలించారు. ఎంతమంది లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేసుకున్నారు తదితర వివరాలను తహసిల్దార్ ను అడిగి తెలుసుకున్నారు. స్థానిక మహిళలు మాట్లాడుతూ మంచినీటి సౌకర్యం కల్పించాలని, రహదారులు నియమించాలని తదితర సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందిస్తూ దశలవారీగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మంచినీటి సదుపాయం ఏర్పాటుపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. లబ్ధిదారులను ప్రోత్సహించి గృహ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలనీ గృహ నిర్మాణశాఖ అధికారులను ఆదేశించారు.

ఈ-శ్రమ పోర్టల్ నందు అసంఘటిత కార్మికులను నమోదు చేయించాలి..

గ్రామ పరిధిలోని అసంఘటిత కార్మికులను నూరు శాతం నమోదు చేయించాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ప్రజలకు మంచి సర్వీసులను అందించి మన్ననలను పొందాలని సూచించారు.

ఆరోగ్య సిబ్బంది ప్రజలకు ఉత్తమ సర్వీసులను అందించాలి…

గ్రామంలో రిస్క్ ప్రెగ్నెన్సీలు ఏమైనా ఉన్నాయా అని వైద్య సిబ్బందిని ఆరా తీశారు. తల్లులు, గర్భవతులు, చిన్నారులలో రక్తహీనత లేకుండా ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించాలన్నారు. ఎత్తు, బరువు తక్కువగా ఉన్న పిల్లలను గుర్తించి పౌష్టికాహారం అందించాలన్నారు. గర్భవతులకు నిర్ణీత కాలంలో తగిన పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను అందించాలన్నారు. వివిధ రకాల క్యాన్సర్లను గుర్తించడానికి చేస్తున్న సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డిఓ కతీబ్ కౌసర్ భానో, గృహ నిర్మాణ శాఖ ఈఈలు బి.వెంకటరమణ, జి.పిచ్చయ్య, డిఈ వైవి వెంకటేశ్వరరావు, తహసిల్దార్ సునీల్ కుమార్, ఎంపీడీవో ఎం విశ్వనాథం, విలేజ్ సర్వేయర్ వినయ్ కుమార్, వీఆర్వో, ఏఎన్ఎంలు, సచివాలయం సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

3.11 3.22 3.33

 

 

 

 

 

 

3.44