Close

రైతులు,కౌలు రైతులు సంతృప్తి చెందేలా క్రాఫ్ ఋణాలు బ్యాంకర్సు ఉదారంగా మంజూరు చేయాలి.

Publish Date : 12/09/2024

గురువారం జిల్లా కలెక్టరేటు వశిష్ట కాన్ఫరెన్స్ హాల్లో వరద ప్రభాత ప్రాంతాల్లో నష్టపోయిన రైతులకు ఋణాలను రీ షెడ్యూల్ చేసి, రైతులు, కౌలు రైతులకు క్రాఫు ఋణాలు మంజూరుపై యుబిఐ, నా బార్డు, సంబంధిత అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అత్యవసర డిసిసి బ్యాంకర్ల సమావేశానికి జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ రెండు పర్యాయములు వచ్చిన అధిక వర్షాలు, వరదలు వలన పశ్చిమగోదావరి జిల్లాలో జూన్ మాసంలో 94 గ్రామాల్లో 5,297.32 హెక్టార్లు 9,918 రైతులు నష్టపోయారన్నారు. జూలై, ఆగస్టు మాసంలో 122 గ్రామాల్లో 3,454.89 హెక్టార్లు 6,050 రైతుల నష్టపోయారని, హార్టికల్చరు 238 హెక్టార్లు 963 రైతులు నష్టపోయారన్నారు. నష్టపోయిన రైతులందరికీ ఋణాలు రెండు సంవత్సరములు నిలుపుదల చేసి, రైతులు, కౌలు రైతులకు క్రాపు లోన్లు విరివిగా ఇచ్చి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. కొత్తగా జాయింటు లైబిలిటీ, జెయల్జి గ్రూపు ఏర్పాటు చేసి గ్రూపు హామీ మీద కూడా ఋణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా పశుసంబంధిత పికెసిసి ఋణాలు కూడా వారి అర్హత ప్రకారం ఆలస్యం చేయకుండా పాడి పరిశ్రమ రైతులకు ఋణాలు మంజూరు చేసి ఆదుకోవాలని బ్యాంకర్లను జిల్లా కలెక్టరు చదలవడ నాగరాణి కోరారు.

బ్యాంకర్ల సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జె.ఉదయ భాస్కరరావు, యుబిఐ రీజనల్ హెడ్ టి.సంగీత కుమారి, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ ఏ.నాగేంద్ర ప్రసాదు, నాబార్డు డిడియం టి.అనిల్ కాంత్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వేంకటేశ్వర రావు, జిల్లా పశుసవర్ధక శాఖ అధికారి డా.కె మురళీ కృష్ణ, డియార్డీఏ పిడి యం.యస్.యస్. వేణు గోపాల్, జిల్లా పరిశ్రమలు శాఖ అధికారి యు.మంగపతి రావు, వివిధ బ్యాంకుల ఉన్నత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.