Close

రైతులకు మేలైన లాభసాటి వరి వంగడాలను అందించడంలో కెవికే శాస్త్రవేత్తలు నిరంతరం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు .

Publish Date : 10/09/2024

మంగళవారం ఉండి మండలం కృషి విజ్ఞాన కేంద్రంను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సైంటిస్టులతో సమావేశమై కృషి విజ్ఞాన కేంద్రంలో కొనసాగుతున్న పరిశోధనలపై ఆరా తీశారు. పరిశోధనలను విస్తృతం చేసి రైతులకు మేలైన వరి, ఫ్లోరికల్చర్, హార్టికల్చర్ వంగడాలను అందించాలన్నారు. ప్రస్తుతం కురిసిన వర్షాల కారణంగా పంట పొలాల్లో, ఉద్యానవన తోటల్లో నీళ్ళు నిలబడి పోవడం జరిగిందని, నీళ్లు తొలగిన అనంతరం చేపట్టాల్సిన తక్షణ చర్యలపై అవగాహన కల్పించాలన్నారు. అలాగే మిల్లెట్ ల సాగు, అంతర పంటల సాగుపై రైతులలో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. కిచెన్ గార్డెన్స్, టెర్రస్ గార్డెన్స్ కు అనువైన మొక్కలను అందించాలన్నారు. పంటల సాగులో డ్రోన్ల వినియోగం పెరగాలని, పురుగుమందులు స్ప్రేయింగ్ కు డోన్లను వినియోగించాలన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో స్ప్రేయింగ్ చేయడంతో పాటు, పురుగు మందులు కూడా ఆదా అవుతాయని తెలిపారు. డ్రోన్లు వినియోగంపై శిక్షణ అందించడానికి తొలి విడుదల 100 మందిని గుర్తించాలని డిఆర్డిఏ పిడి కి సూచించారు. జిల్లాలో ఇప్పటికే ఆరు డ్రోన్లను మహిళా సభ్యులకు అందజేయడం జరిగిందని, వాటిని వెంటనే వినియోగంలోనికి తేవాలని ఆదేశించారు. కృషి విజ్ఞాన కేంద్రంలో వివిధ వంగడాలపై పరిశోధనలు చేసి గుర్తించిన మొక్కలను జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించి శాస్త్రవేత్తలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 16 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్న వివిధ వరి వంగడాల వరి పంట పొలాలను పరిశీలించారు. అనంతరం చేపల మరియు రొయ్యల వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలను సందర్శించి పరిశీలించారు. పరీక్షలకు అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయా అని ప్రశ్నించారు. అందుబాటులో లేని మిషనరీని తెప్పించి పరీక్షలను పెద్ద ఎత్తున చేపట్టి రైతులకు విస్తృత సేవలను అందించాలన్నారు.

కెవికె సందర్శన సందర్భంలో కె వి కె శాస్త్రవేత్తలు ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్.మల్లికార్జునరావు, ఫిషరీస్ రీసెర్చ్ హెడ్ డాక్టర్ చంద్రశేఖర రావు, కమ్యూనిటీ సైన్స్ డాక్టర్ ఎన్.దేబొర మిస్సయనా, ఫిషరీస్ డాక్టర్ ఏ.శ్రీనివాసరావు, క్రాప్ ప్రొడక్షన్ డాక్టర్ పి.వినయ లక్ష్మి, ఎక్స్టెన్షన్ బి.రజిత, ఫామ్ మేనేజర్ బి.రామకృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి జెడ్. వెంకటేశ్వరరావు, ఆకివీడు ఏ.డి.ఏ కె.ఎస్.ఎస్ శ్రీనివాస్, ఏవో బి.సంధ్య, ఉండి ఇన్చార్జి తహసిల్దార్ ఎం.రఘు, జిల్లా మత్స్యశాఖ అధికారి ఆర్ వి ఎస్ ప్రసాద్, కె వి కె సిబ్బంది, తదితరులు ఉన్నారు.