Close

రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు అందించే లక్ష్యంతో ఖచ్చితమైన ప్రయోగ ఫలితలను అందజేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Publish Date : 17/04/2025

బుధవారం తాడేపల్లిగూడెంలోని ఎరువుల నియంత్రణ ఉత్తర్వుల ప్రయోగశాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించి, రాష్ట్రంలోనే మొట్టమొదటిగా తాడేపల్లిగూడెం ప్రయోగశాల నందు రూ.27 లక్షలతో ఏర్పాటుచేసిన అటోమిక్ అబ్సెర్ప్షన్ స్పెక్ట్రో ఫోటోమీటర్ ను, రూ.21 లక్షలతో ఏర్పాటు చేసిన గ్యాస్ లిక్విడ్ చోరోమెటోగ్రఫీ మిషనరీని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రయోగ పరీక్షలు నిర్వహించే విధానాన్ని శిక్షణ పొందిన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ యంత్రాల ద్వారా ఎరువులు, పురుగు మందులలో సూక్ష్మ, స్థూల పోషకాలను పరీక్షించేందుకు వినియోగించడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రయోగశాలలో సంవత్సరానికి 3 వేలు ఎరువులు, 2 వేలు పురుగుమందుల శాంపిల్స్ ను తనిఖీ చేసి నివేదికలను అందజేయడం జరుగుతుందని, అలాగే విత్తనాలు, భూసార పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుందని వారు వివరించారు. జిల్లా కలెక్టర్ అక్కడ పనిచేస్తున్న వ్యవసాయ శాఖ ఏడిఏ, వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడుతూ బాధ్యతగా పని చేసి ప్రయోగశాలకు మంచి పేరును తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రయోగశాలకు మధునాతన ప్రయోగ యంత్రాలను అందించడం జరిగిందన్నారు. ఈ యంత్రం ద్వారా ఎరువులలో జింకు, కాపర్, మెగ్నీషియం తదితర సూక్ష్మ పోషకాలు లభ్యత తెలుసుకోవటానికి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే నాణ్యమైన ఎరువులను పరిశీలించి రైతులకు అందుబాటులోనికి తేవటానికి ఈ యంత్రాలు ఉపయోగపడతాయని అన్నారు పురుగుమందుల ల్యాబ్ రేటరీ జి ఎల్ ఎస్ విశ్లేషణలో బాగా వస్తుందని అన్నారు. దేశ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా తాడేపల్లిగూడెంలోనే రీజనల్ కోడింగ్ సెంటర్, ప్రయోగశాల ఉండటం చాలా గొప్ప విషయం అన్నారు. రాష్ట్రం మొత్తం ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు శాంపిల్స్ను సేకరించి తాడేపల్లిగూడెం, అమరావతి, విశాఖపట్నం, తిరుపతి రీజనల్ కోడింగ్ సెంటర్లకు పంపడం జరుగుతుందని, అక్కడనుండి బాపట్ల తాడేపల్లిగూడెం అనంతపురం ప్రయోగశాలలకు పంపి పరీక్షల నిర్వహించి పరీక్ష ఫలితాలను తిరిగి డీకోడింగ్ సెంటర్ లకు పంపడం జరుగుతుందన్నారు. ప్రయోగ ఫలితాలలో నాణ్యత లోపిస్తే కేసులు బుక్ చేయడం జరుగుతుందని, తాడేపల్లిగూడెం సెంటర్లో నిర్వహించిన పరీక్ష ఫలితాలు సంబంధించి 101 కేసులను రిఫర్ చేయడం జరిగిందని తెలిపారు.

అనంతరం వ్యవసాయ శాఖ కార్యాలయం ఆవరణలో మామిడి మొక్కను జిల్లా కలెక్టర్ నాటారు.

ఈ సందర్భంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, ఏడిఏ జె.శశి బిందు, డిడి శ్రీనివాస్, ఏవోలు వై.ఇందిరా ఝాన్సీ, ఏడిఏ మురళీకృష్ణ, తదితరులు ఉన్నారు.