Close

రైతులకు నచ్చిన మిల్లులకు ధాన్యం విక్రయించుకునే విధంగా వెసులుబాటు జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 05/04/2025

శనివారం భీమవరం మండలం తుందూరు గ్రామం రైతు సేవా కేంద్రం వద్ద జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, పులపర్తి రామాంజనేయులు, ధాన్యం కొనుగోలు కేంద్రం, ధాన్యం లోడు వాహనమును జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రబీ సాగులో జిల్లాలో 348 ధాన్యం కొనుగోలు ద్వారా ఆరు లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశామని అన్నారు. ఏప్రిల్ మొదటి వారం నుండి ధాన్యం కొనుగోలు కేంద్రంలు ప్రారంభించి ఆర్ ఎస్ కే ల ద్వారా సేకరించడం జరుగుతుందని అన్నారు.
రైతులు పండించిన ధాన్యాన్ని వారికి నచ్చిన మిల్లులకు విక్రయించుకునే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని అన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా వాట్సాప్ విధానమును అనుసరించి రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యమును అమ్ముకునే సదుపాయమును సద్వినియోగం చేసుకోవాలన్నారు.
80 శాతం గింజ గట్టిపడిన తరువాత కోత కోసి రెండు రోజులు పాటు ఆరబెట్టి 17 శాతం తేమ ఉండేలా చూసుకుని రైతు సేవ కేంద్రాలకు తీసుకు రావాలన్నారు. మరి ఎక్కువ శాతం ఆరబెట్టిన ధాన్యం ముక్క అయ్యి దిగుబడి తగ్గుతుందని రైతులు గమనించాలి అన్నారు. రైతులందరూ ట్రక్ షిటు జనరేట్ చేసిన తరువాత ఈ కె వై ఎస్ వై యస్ వేలిముద్ర తప్పనిసరి వేయాలని అప్పుడు రైతు ఖాతాలో డబ్బులు త్వరగా పడతాయని అన్నారు. మిల్లు నుండి వచ్చే గోనే సంచులును వెంటనే పరిశీలించి డామేజ్ ఉన్న సంచులను తిరిగి మిల్లులకు పంపే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేసి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ రైతులు అభివృద్ధి ధ్యేయముగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతు ప్రతి అవసరాన్ని ముందుగా తెలుసుకుని తీర్చేందుకు అధికారులందరూ పనిచేయాలన్నారు. రైతు పండించిన పంటకు ప్రభుత్వం కల్పించిన గిట్టుబాటు ధరకు అమ్ముకుని లాభసాటి పొందాలి అన్నారు. మధ్య దళారులను నమ్మి మోసపోవద్దు అన్నారు.
పంట పొలాలు మునక బారిన పడకుండా డ్రైనులు, కాలువలు ప్రక్షాళన చేయటం జరుగుతుందని రైతులందరూ సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్స్ సప్లయ్ మేనేజరు టి. శివరాం ప్రసాద్, డీఎస్ఓ ఎన్ సరోజ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, సహాయ సంచాలకులు చింత శ్రీనివాస్, ఎంఏవో ఎం శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, నీటి సంఘం అధ్యక్షులు సతీష్, గ్రామ సర్పంచి ఎంపీటీసీ, ఆర్ ఎస్ కె సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.