రేషన్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ
ఉండి బాలాజీ రావు పేట లో రేషన్ షాప్ నెంబర్ 3 గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా రేషన్ షాపులో ప్రజలకు అందిస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీ తీరును, స్టాక్ వివరాలను, సంబంధిత రికార్డులను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు.
షాపులో అందుబాటులో ఉన్న సరుకుల నిల్వలు, ఇప్పటివరకు లబ్ధిదారులకు పంపిణీ చేసిన సరుకుల వివరాలను రికార్డులతో సరిపోల్చి చూశారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు లబ్ధిదారులకు సరుకులు సక్రమంగా పంపిణీ చేస్తున్నారా లేదా అనే అంశాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ మాట్లాడుతూ, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకులు సకాలంలో, పారదర్శకంగా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎఫ్‌సీ షాపుల నిర్వహణ ఉండాలని సూచించారు.
షాపులో స్టాక్ వివరాలు, సరుకుల ధరలు, పంపిణీకి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు స్పష్టంగా కనిపించే విధంగా ప్రదర్శించాలని తెలిపారు. రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని, స్టాక్‌లో తేడాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ప్రజా పంపిణీ వ్యవస్థపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని, నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తిస్తే బాధ్యులపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రజలకు పూర్తి స్థాయిలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ అన్నారు.
ఈ సందర్భంలో డి ఎస్ ఓ
ఎన్. సరోజ,, తాహసిల్దార్ ప్రసాద్ రాజు, సి ఎస్ డి టి సూర్యనారాయణ రాజు,తదితరులు ఉన్నారు.