Close

రేపు బుధవారం పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహప్రవేశాలకు ఏర్పాట్లు పూర్తి..

Publish Date : 11/11/2025

ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకంలో 595 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు ఉత్తర్వులు పంపిణీ

… జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల గృహాల నిర్మాణాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రేపు నవంబర్ 12వ తేదీన సామూహిక గృహప్రవేశాలను చేపట్టుటకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 1.0 లో పశ్చిమగోదావరి జిల్లాకు కేటాయించిన 6,770 గృహాలకు 6,600 ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసుకుని గృహప్రవేశాలను ఇప్పటికే పూర్తి చేసుకోవడం జరిగిందని, ప్రస్తుతం ఇళ్ల నిర్మాణాలు పూర్తయి సిద్ధంగా ఉన్న100 ఇళ్ళ గృహప్రవేశాలను అన్ని నియోజకవర్గాల్లో రేపు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా కార్యక్రమాన్ని రేపు నవంబర్ 12వ తేదీ ఉదయం 11.00 గంటలకు ఆకువీడు మండలం కుప్పనపూడి లేఔట్ లో నిర్వహించడం జరుగుతుందని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకంలో 595 మంది లబ్ధిదారులకు కొత్తగా మంజూరు చేసిన ఉత్తర్వులు పంపిణీ కూడా ఈ కార్యక్రమాలలో చేపట్టడం జరుగుతుందని తెలిపారు. సామూహిక గృహప్రవేశ కార్యక్రమాల్లో జిల్లాలోని కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనడం జరుగుతుందని తెలిపారు.