రేపు జూన్ 19వ తేదీన 5 వేల మందితో భీమవరం డిఎన్ ఆర్ కళాశాల గ్రౌండ్ లో నిర్వహించే మెగా యోగ ప్రదర్శన విజయవంతం చేసేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి.
మెగా యోగ ప్రదర్శన లో పాల్గొననున్న అథ్లెటిక్స్, స్పోర్ట్స్ గ్రూప్స్, యూత్ గ్రూప్స్, కళాశాల, పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు.
యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణలో భాగంగా గురువారం నిర్వహించే మెగా యోగ ప్రదర్శన రాష్ట్రస్థాయిలో జిల్లాను ప్రథమ స్థాయిలో ఉంచేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలి.
.. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు జిల్లాకు కేటాయించిన ప్రత్యేక థీమ్ “అథ్లెటిక్స్, స్పోర్ట్స్ గ్రూప్స్, యూత్ గ్రూప్స్” తో నిర్వహించే మెగా యోగ ప్రదర్శన విజవంతం చేసేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులు ఆదేశించారు.
జూన్ 19న డిఎన్ఆర్ కళాశాల గ్రౌండ్లో నిర్వహించే మెగా యోగ ప్రదర్శన కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై బుధవారం జిల్లా అధికారులు, కళాశాలల, పాఠశాలల యాజమాన్యాలతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏ కార్యక్రమం చేపట్టిన జిల్లా యంత్రాంగం విజయవంతం చేస్తుందనే నమ్మకం, మంచి పేరు మన జిల్లాకు ఉందని కావున గురువారం నిర్వహించే మెగా యోగా కార్యక్రమాన్ని అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. జిల్లాకు చెందిన కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండల సభ్యులు, ప్రముఖులు యోగా ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న దృష్ట్యా ఎక్కడ ఎటువంటి లోపం లేకుండా అన్ని ఏర్పాట్లు శ్రద్ధతో చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ యోగ ప్రదర్శన కార్యక్రమం గురువారం ఉదయం 6.00 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ఆయా కళాశాలల, పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు ఆ సమయానికి హాజరయ్యేలా ఆయా యాజమాన్యాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ యోగాబ్యాసనా కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థినీ, విద్యార్థులు తప్పనిసరిగా వైట్ టీ షర్ట్ గాని లేదా లైట్ కలర్ టీ షర్ట్ గాని ధరించి రావాలన్నారు. కళాశాల, పాఠశాలల యూనిఫాం ధరించరాదన్నారు. దీనికి సంబంధించి ఆ యాజమాన్యాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ యోగా ప్రదర్శన లైవ్ టెలికాస్ట్ జరుగుచున్నందున రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులు తిలకిస్తారని కావున ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. యోగా ప్రదర్శనకు హాజరయ్యే కళాశాల పాఠశాలల విద్యార్థిని,విద్యార్థులకు ప్రత్యేకంగా మార్కింగ్ ప్రదేశాలను కేటాయించడం జరిగిందని ఆయా మార్కింగ్ ప్రదేశాల్లో ఆసీనులై క్రమశిక్షణతో యోగ కార్యక్రమంలో పాల్గొనేందుకు యాజమాన్యాలు సహకరించాలని కోరారు. ఈ యోగా కార్యక్రమానికి వివిధ కళాశాల పాఠశాలల నుండి బస్సులలో వస్తున్న దృష్ట్యా డిఎన్ఆర్ కళాశాల వద్ద బస్సుల పార్కింగ్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఒక్కసారిగా కళాశాలల, పాఠశాల విద్యార్థులు గ్రౌండ్ లోకి ఎంట్రీ సమయంలో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చేరుకునేందుకు సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.యోగ ప్రదర్శన వద్ద సురక్షితమైన త్రాగునీరు, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా టాయిలెట్స్ ఏర్పాటు చేసి సైన్ బోర్డులు పెట్టాలన్నారు. యోగ ప్రదర్శన హాజరయ్యే వారందరికీ అల్పాహారం ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు. ఈ మెగా యోగ ప్రదర్శన కార్యక్రమం ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ నాగరాణి చదలవాడ నాగరాణి కోరారు.
. ఈ గూగుల్ మీట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ వి.భీమారావు, జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు, డీఈవో ఇ.నారాయణ, డి ఆర్ డి ఏ పిడి సిహెచ్ వేణుగోపాల్, డి ఎం అండ్ హెచ్ ఓ జి. గీతాబాయి, డిటిఓ ఉమామహేశ్వరరావు వివిధ శాఖల అధికారులు, అదేవిధంగా ఎస్ఆర్ కెఆర్ ఇంజనీరింగ్ కళాశాల, విష్ణు ఇంజనీరింగ్ కళాశాల, భారత్ విద్యా భవన్, నారాయణ జూనియర్ కళాశాల, చైతన్య, ఆదిత్య, భాష్యం విద్యాసంస్థల ఇతర విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.