రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.
శనివారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన వివిధ రెవెన్యూ అంశాలపై జిల్లాలోని డివిజన్, మండల స్థాయి రెవిన్యూ అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రీ సర్వే,22 ఏ,అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, పి జి ఆర్ ఎస్ ఫిర్యాదులు, రైస్ కార్డులు,క్యాస్ట్ వెరిఫికేషన్, కోర్టు కేసులు అంశాలపై జిల్లాలోని ఆర్డీవోలు,తహసిల్దారులు మండల సర్వేలతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు పేజ్- 1 లో పెండింగ్ లో ఉన్న గ్రామాల రీ సర్వే సెప్టెంబర్ 10లోపు, పేజ్- 2లో 27 గ్రామాలలో రీ సర్వే సెప్టెంబర్ 30 తేదీ లోపు, పేజ్- 3 లో 72 గ్రామాలలో ప్రభుత్వ భూముల సర్వే షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 22ఎ లోని వాస్తవ కేసులను సత్వరమే పరిష్కరించాలన్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన పిజిఆర్ఎస్ ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కాకపోతే దీనికి కారణాలను విశ్లేషించడంతోపాటు, ఆధార్ సీడింగ్ అప్డేట్ కానీ వారికి అప్డేట్ చేసి వారి ఖాతాలలో నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్యాస్ట్ వెరిఫికేషన్ పెండింగ్ కేసులను సత్వరమే పూర్తి చేయాలి అన్నారు. స్మార్ట్ రైస్ కార్డులు సచివాలయ సిబ్బంది అందజేయగా, మిగిలిన కార్డులను సెప్టెంబర్ 1 నుండి రేషన్ డీలర్ వద్ద నుండి తీసుకోవాలని సూచించారు. ఈ విషయమై లబ్ధిదారులకు సమాచారాన్ని చేరవేయాలన్నారు. పెండింగ్ కోర్టు కేసుల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. జాయింట్ ఎల్పియం ఖాతాలను త్వరగా పరిష్కరించాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఇన్చార్జి డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం ఆర్డీవోలు కే ప్రవీణ్ కుమార్ రెడ్డి, దాసిరాజు, కతీబ్ కౌసర్ భానో, జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దారులు, డిప్యూటీ తహసిల్దారులు, తదితరులు పాల్గొన్నారు.