Close

రెండు సంవత్సరాలుగా పరిష్కారం కానీ చిన్న మామిడిపల్లి, దర్శిపర్రు గ్రామాల రైతుల భూముల రిజిస్ట్రేషన్లకు విముక్తి…

Publish Date : 11/02/2026

ఆయా గ్రామాల రైతులలో వెల్లివిరిసిన ఆనందం

వెబ్ ల్యాండ్ లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించి, పరిశీలించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి…

నరసాపురం సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించి నరసాపురం మండలం చిన్న మామిడిపల్లి, పెంటపాడు మండలం దర్శిపర్రు గ్రామాలలో రైతుల భూముల పెండింగ్ రిజిస్ట్రేషన్ల పరిష్కారానికి నేడు వెబ్ ల్యాండ్ లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించి, పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. నరసాపురం మండలం చిన్న మామిడిపల్లి, పెంటపాడు మండలం దర్శిపర్రు గ్రామాలలోని కొంత ప్రాంతం నరసాపురం, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలలో కలవడంతో ఆయా గ్రామాలలో నిర్వహించిన రిసర్వే లో ఆ ప్రాంతాలకు ఎల్పీఎంలు విడుదల కాకపోవడం, గత రెండు సంవత్సరాలుగా రైతుల భూములకు రిజిస్ట్రేషన్లు జరగక పడుతున్న ఇబ్బందులు నేటితో తొలగిపోయాయి. ఈ రెండు గ్రామాల రిజిస్ట్రేషన్ సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం ప్రభుత్వంతో పలు దఫాలుగా చర్చించిన మీదట వెబ్ ల్యాండ్ లో 2.0 గ్రామాలుగా క్రియేట్ చేసి ఎల్పీఎంలు కాకుండా సర్వే నెంబర్లు జారీ ద్వారా నేటి నుండి రిజిస్ట్రేషన్ ల పక్రియకు మార్గం ఏర్పాటు చేయడం జరిగింది. గత రెండు సంవత్సరాలగా రైతులు తమ భూములను అవసరాలకు అమ్మడానికి, వారసులు పేరున రిజిస్ట్రేషన్ చేయడానికి ఆటంకంగా ఉండేది. రెండు గ్రామాల్లో సుమారు 1,700 ఎకరాలలోని 2 వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరనున్నది.

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో దాసిరాజు, ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్ ఎన్.నిరంజన్ కుమార్, తహసిల్దార్ ఐతం సత్యనారాయణ, పాల్గొన్నారు.

222