రాష్ట్ర స్థాయి నైపుణ్య పోటీలులో సత్తా చాటిన పశ్చిమగోదావరి జిల్లా విద్యార్థులు
ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ పోటీలలో విజయం సాధించిన చెరుకువాడ జడ్పీ స్కూల్ విద్యార్థులు
ఒకేషనల్ కోర్సులు విద్యార్థుల భవిష్యత్తులో స్థిరపడడానికి చుక్కానిలా నిలుస్తాయి
మరిన్ని విజయాలు సాధించాలని అభినందించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
“రాష్ట్ర స్థాయి నైపుణ్య పోటీలు” లో విజయం సాధించిన చెరుకువాడ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని కలిసి వారు సాధించిన విజయాన్ని వివరించారు. నిజ జీవితంలో ఎలక్ట్రాన్స్ ద్వారా సాధించే అద్భుతాలపై ప్రాజెక్టును రూపొందించి ప్రదర్శించడం జరిగిందని, ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర స్థాయిలో మెడల్స్, సర్టిఫికెట్స్ తో పాటు 25 వేల రూపాయల నగదు బహుమతిని సాధించడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా 26 జిల్లాలతో నిర్వహించిన పోటీలలో ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ నందు మన జిల్లా జెడ్పీ ఒకేషనల్ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో విజయం సాధించడం ఎంతో సంతోషించదగిన విషయం ఉన్నారు. ఇదే స్ఫూర్తితో జాతీయస్థాయిలో నిర్వహించే “ఇండియాస్కిల్స్ పోటీలు”లో కూడా విజయం సాధించాలన్నారు. రాష్ట్రాల్లో యువత తమ నైపుణ్యాలను ప్రదర్శించి విజయం సాధిస్తే, జాతీయ, ప్రపంచ వేదికలపై ప్రాతినిధ్యం వహించే అవకాశం పొందుతారని తెలిపారు. యువతలో నైపుణ్యాలను పెంచడం, జాతీయ స్థాయిలో పోటీ పడేలా ప్రోత్సహించడం, ప్రపంచ నైపుణ్య పోటీలకు ఎంపిక చేయడం ఈ పోటీల లక్ష్యం అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 35 జిల్లా పరిషత్, పిఎం శ్రీ పాఠశాలల్లో ఎనిమిది ట్రేడ్స్ నందు ఒకేషనల్ తరగతులను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వీటిలో బ్యూటీ థెరపీ, ఎలక్ట్రానిక్స్, అగ్రికల్చర్, రిటైల్స్, బి.ఎఫ్.ఎస్.ఐ, ఆటోమేషన్, ఐటి & ఐటిఇఎస్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి వివిధ నైపుణ్య విభాగాల ట్రేడ్లులో శిక్షణను అందించడం జరుగుతుందన్నారు. విద్యార్థుల అభిరుచి మేరకు తరగతి సబ్జెక్టులతో సమాంతరంగా ఏదో ఒక ట్రేడ్ నందు ఒకేషనల్ ట్రైనింగ్ ను పొందవచ్చని, 6, 7, 8 తరగతుల విద్యార్థులను ప్రీ వొకేషన్, 9 10, ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులను సీనియర్ ఒకేషనల్ విద్యార్థులుగా విభజించి ఆయా ట్రేడ్ ల నందు శిక్షణను అందించడం జరుగుతుందన్నారు. అమెరికా టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్ మల్టీ నేషనల్ కంపెనీలో డిప్లమా విద్యార్థులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఇంటర్మీడియట్ అనంతరం ఒకేషనల్ కోర్సులు విద్యార్థులు ఉద్యోగాలలో స్థిరపడటానికి మంచి అవకాశంగా ఉంటుందన్నారు. ఇంటర్మీడియట్ అనంతరం ఐటిఐ., పాలిటెక్నిక్ వంటి కోర్సులను ఎంపిక చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఉంటాయని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు మంచి పేరు తేవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. జి.దిలీప్, వి.కేశవ్ హృదయ్, డి.జోసెఫ్ రాజు, డి.సాత్విక్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో తయారుచేసిన ప్రాజెక్టు రాష్ట్రస్థాయిలో ఎంపిక కావడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీసి పి.శ్యాంసుందర్, డిఇఓ ఇ.నారాయణ, జిల్లా ఒకేషనల్ కోఆర్డినేటర్ పి.సంజీవ్ కుమార్, జిసిడివో జెస్సీ దీవెనమ్మ, ఏఎంఓ సిహెచ్ చంద్రశేఖర్, ఉపాధ్యాయులు వి.నిష్యంత్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.