Close

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కు పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో అపూర్య ఘన స్వాగతం…

Publish Date : 31/01/2025

శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెనుగొండ అగ్రికల్చర్ మార్కెటు యార్డ్ లో ఏర్పాటు చేసిన హేలిఫ్యాడ్ నందు ఉదయం 11:53 నిమిషాలకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనస్వాగతం పలికిన వారిలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టరు నిమ్మల రామానాయుడు, జిల్లా పరిషత్తు చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, పులపర్తి రామాంజనేయులు, బొల్లినేని శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, ఆరిమిల్లి రాధాకృష్ణ, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, రాష్ట్ర ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఏపీ ఎస్ సిపిసి చైర్పర్సన్ పీతల సుజాత, మాజీ పార్లమెంటు సభ్యురాలు తోట సీతా రామలక్ష్మి, మాజీ శాసన మండలి సభ్యులు అంగర రామ్మోహన్, మాజీ శాసన సభ్యులు బండారు మాధవ నాయుడు,ముళ్ళపూడి బాపిరాజు, జిల్లా బిజెపి జిల్లా అధ్యక్షులు ఐనంపూడి శ్రీదేవి, సర్పంచి నక్కా శ్యామల సోనీ, తదితరులు పాల్గొన్నారు.

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు పెనుగొండ శ్రీ నగరేశ్వర, మహిషాసురమర్దిని శ్రీ వాసవికన్యకా పరమేశ్వరి అమ్మ వారి దేవస్థానంను చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి

వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి..

వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు…

22

23